టాక్స్ పెంచి ప్రజల రక్తం తాగడం చాల్లేదా? KCR పై షర్మిల ఫైర్ 

-

ముఖ్యమంత్రి కేసీఆర్‌పై వైఎస్‌ఆర్‌టీపీ అధ్యక్షురాలు షర్మిల సంచలన వ్యాఖ్యలు చేశారు. రుణమాఫీ ప్రకటనపై స్పందిస్తూ.. ట్విట్టర్ వేదికగా ఇలా రాసుకొచ్చారు. ‘‘దేశంలో ముఖ్యమంత్రులు ప్రమాణస్వీకారం తర్వాత హామీలు నెరవేరిస్తే.. దొర గారికి మాత్రం ఎన్నికల ముందే హామీలు యాదికొస్తాయి. నాలుగేండ్లు గడీల్లో కుంభకర్ణుడిలా మొద్దు నిద్ర పోయిన ముఖ్యమంత్రి.. ఓట్ల కోసం అటక మీద దాచిన మేనిఫెస్టో తిరగేస్తున్నారు. ఇప్పుడు మళ్లీ రైతులను ఓట్లు అడిగే ముఖం లేక రుణమాఫీ చేస్తానని నక్క వినయం ప్రదర్శిస్తున్నా.. అమలు చేయడానికి కేసీఆర్ దగ్గర చిల్లిగవ్వ లేని పరిస్థితి.

- Advertisement -

బీఆర్ఎస్ బంధిపోట్లకు నాలుగున్నరేళ్లుగా తెలంగాణ సొమ్మంతా దోచుకోవడం, దాచుకోవడానికే సరిపోయింది.. ఇక మేనిఫెస్టోలో హామీలు నెరవేర్చడానికి డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి.. అందుకే రుణమాఫీకి డబ్బుల్లేక నవంబర్‌లో చేయాల్సిన మద్యం టెండర్లను మూన్నెళ్ల ముందే ముంగటేసుకున్నడు. జనాలకు మద్యం తాగిస్తాడట.. వచ్చిన సొమ్ముతో రుణమాఫీ చేస్తాడట. సిగ్గుందా ముఖ్యమంత్రి గారు? రేట్లు పెంచి, టాక్స్ పెంచి ప్రజల రక్తం తాగడం చాలదని.. మద్యం తాగించి, మహిళల మంగళసూత్రాలు తెంపి, జనాలను మద్యానికి బానిస చేసి ఓట్లు దండుకోవడమా? కరోనా సమయంలోనూ రాష్ట్రం ఆర్థికంగా దూసుకెళ్లిందని, నిధుల కొరత లేదని ఇన్నాళ్లూ గప్పాలు కొట్టిన దొర.. ఇప్పుడు రుణమాఫీ చేయడానికి కరోనా అడ్డుతగిలిందట! ఇది చాలదన్నట్లు ఔటర్ రింగ్ రోడ్డును అగ్గువల 7 వేల కోట్లకే లీజుకిచ్చుకున్నరు.. ప్రభుత్వ భూములను యథేచ్చగా అమ్ముకుంటున్నరు.. పకడ్బందీగా ఎన్నికల కోసం డబ్బును పోగు చేసుకుంటున్నరు.. మొత్తానికి కేసీఆర్ ఏం చేసినా ఎన్నికల కోసమే చేస్తడు అనే మాట నిలబెట్టుకుంటున్నడు.. నీ పిట్టల దొర ముచ్చట్లను నీ పార్టీ ఎమ్మెల్యేలు కూడా నమ్మరు.

ఓట్ల కోసమైనా ఇచ్చిన హామీలు గుర్తు చేసుకుంటున్న దొర గారు.. అదే చేతితో డబుల్ బెడ్ రూం ఇండ్లు ఇవ్వండి, నిరుద్యోగ భృతి ఇవ్వండి, వరద బాధితులను ఆదుకోండి, ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్లు ఇవ్వండి, చట్ట సభల్లో బీసీలకు 33%, మహిళలకు 33% రిజర్వేషన్లు అమలు చేయండి, ఆగిపోయిన దళిత బంధును,మైనార్టీ బంధును అమలు చేయండి.. బీసీల్లోని అన్ని కులాలకు బీసీ బంధు ఇవ్వండి. ఎన్నికలకు ముందే రెండు దఫాల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చి, మీరు పిట్టల దొర కాదని నిరూపించుకోండి.’’ అని ట్విట్టర్ వేదికగా ముఖ్యమంత్రి కేసీఆర్‌పై షర్మిల సంచలన వ్యాఖ్యలు చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

40 ఏళ్లు పోలీసులను బురిడీ కొట్టించిన ఖైదీ

నలభై ఏళ్ల నుంచి బురిడీ కొట్టించి తప్పించుకుని తిరుగుతున్న ఖైదీ ఎట్టకేలకు...

ఇండియన్ ఎయిర్ ఫోర్స్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్

Indian Air Force Agnipath | అగ్నిపథ్ పథకంలో భాగంగా అగ్నివీర్...