పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ‘OG’ మూవీ టైటిల్ ఫిక్స్!

-

పవర్ స్టార్ పవన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ఓజీ(OG). దీనిని యువ దర్శకుడు సుజిత్ తెరకెక్కిస్తున్నాడు. ముంబై గ్యాంగ్‌స్టర్ నేపథ్యంలో వస్తోన్న ఈ చిత్రంపై అభిమానులు భారీగా అంచనాలు పెట్టుకున్నారు. మ్యూజిక్ సెన్సేషన్ తమన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు. ఆర్ఆర్ఆర్ చిత్ర నిర్మాత డీవీవీ దానయ్య నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. తమిళ నటి ప్రియాంక మోహన్ కథానాయికగా నటిస్తోంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన మోషన్ పోస్టర్‌కు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది.

- Advertisement -

ఇదిలా ఉండగా.. ఈ చిత్రానికి సంబంధించి టైటిల్ ఖరారు అయినట్లు తెలుస్తోంది. #TheyCallHimOG అనే టైటిల్‌ను ఖరారు చేసినట్లు చిత్ర నిర్మాత దానయ్య సోషల్ మీడియా వేదికగా క్లారిటీ ఇచ్చారు. అంతేగాక ఈ టైటిల్‌ను మార్చిలోనే రిజిస్టర్ చేయించినట్లు తెలిపారు. వచ్చే ఆగష్టు 15వ తేదీ సినిమా టైటిల్‌ను అధికారికంగా ప్రకటించడంతో పాటు ఫస్ట్‌లుక్‌ను కూడా విడుదల చేయడానికి సన్నహాలు చేస్తున్నట్లు సమాచారం. సెప్టెంబర్ 2వ తేదీన పవన్ కల్యాణ్ పుట్టినరోజు సందర్భంగా టీజర్‌ రిలీజ్ చేయడానికి ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

మహాసేన రాజేష్ యూటర్న్.. జనసేనను ఓడిస్తామని సంచలన వ్యాఖ్యలు..

ఏపీ ఎన్నికల వేళ అనూహ్య పరిణామాలు చోటుచేసుకున్నాయి. తాజాగా జనసేన పార్టీకి...

అంబటి రాంబాబు వ్యాఖ్యలపై అల్లుడు మరో వీడియో

ఏపీ ఎన్నికలు హాట్‌హాట్‌గా సాగుతున్నాయి. ఈ క్రమంలోనే మంత్రి అంబటి రాంబాబు(Ambati...