తనపై ఉన్న సీబీఐ కేసులలో ఏళ్ల తరబడి కోర్టుకు వెళ్లకుండా ఉండడం దేశ చరిత్రలో ఏపీ సీఎం జగన్‌కే దక్కుతుందని టీడీపీ సీనియర్ నేత అయ్యన్నపాత్రుడు(Ayyanna Patrudu) విమర్శించారు. కేంద్ర మంత్రులు, సీఎంలుగా పనిచేసిన వారిని అరెస్ట్ చేసిన సీబీఐ అధికారులు.. మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్య కేసులో మాత్రం కేవలం ఓ ఎంపీని ఎందుకు అరెస్ట్ చేయలేకపోయారని ప్రశ్నించారు. వైసీపీకి చెందిన 30 మంది ఎంపీలకు అవినాశ్ రెడ్డి(Avinash Reddy)ని కాపాడటం తప్ప మరే పని లేదని ఎద్దేశా చేశారు. కర్నూలులో వైసీపీ గూండాలు సీబీఐని అడ్డుకోవడం వెనుక పెద్దల హస్తం ఉందని ఆరోపించారు. వివేకా హత్య కేసులో దుర్మార్గులతో రాజీ లేని పోరాటం చేసున్న డాక్టర్ సునీతకు అభినందనలు తెలియజేశారు. ఆమెకు ప్రజలందరూ అండగా నిలబడాలని అయ్యన్న(Ayyanna Patrudu) పిలుపునిచ్చారు.
దేశ చరిత్రలో ఆ ఘనత జగన్‌కే దక్కుతుంది: అయ్యన్నపాత్రుడు
-