దేశమంతా రామ నామ స్మరణతో మార్మోమోగుతోంది. తన జన్మ భూమిలో ఆ బాలరాముడు శాశ్వతంగా కొలువు దీరే అమృత ఘడియలకు వేళాయింది. జై శ్రీరామ్ నినాదాల మధ్య రాములోరి ప్రాణప్రతిష్ట కార్యక్రమం జరగనుంది. ఈ నేపథ్యంలో అక్కడికి వచ్చే రామభక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేస్తున్నారు. ఎవరికి వారు తమకు తోచిన విధంగా సాయం చేస్తున్నారు. దీంతో టీటీడీ కూడా లక్ష లడ్డూలను(Tirumala Srivari Laddu) అయోధ్యకు తరలించింది.
రామ భక్తులకు 25 గ్రాముల బరువు ఉంటే శ్రీవారి లడ్డూలను ప్రసాదంగా ఇవ్వనుంది. తిరుమలలోని శ్రీవారి సేవాసదన్-1లో శ్రీవారి సేవకులు ఒక్కో కవర్‌లో రెండు చిన్న లడ్డూలు చొప్పున మొత్తం 350 బాక్సులను సిద్ధం చేశారు. దాదాపు 3వేల కేజీల బరువు ఉండే ఈ లడ్డూల తయారీలో 350 మంది శ్రీవారి సేవకులు ఈ సేవలో పాల్గొన్నారు. స్వచ్ఛమైన దేశీయ ఆవునెయ్యిని వినియోగించి ఈ లడ్డూలు తయారు చేశారు. శ్రీవారి లడ్డూ ప్రసాదాన్ని(Tirumala Srivari Laddu) తిరుపతి విమానాశ్రయం నుంచి ప్రత్యేక కార్గో ఎయిర్ క్రాఫ్ట్ ద్వారా అయోధ్యకు తరలిస్తున్నారు. ఈ విమానం సాయంత్రంలోగా అయోధ్య(Ayodhya)కు చేరుతుంది.