Home BUSINESS మహిళలకు గుడ్ న్యూస్..భారీగా తగ్గిన బంగారం ధర

మహిళలకు గుడ్ న్యూస్..భారీగా తగ్గిన బంగారం ధర

0
204

మహిళలకు శుభవార్త..అలంకరణకు మహిళలు అత్యధిక ప్రాముఖ్యత ఇస్తారు. ఏ చిన్న పండగ జరిగినా బంగారం, వెండి కొనుగోలు చేయడానికి మహిళలు చాలా ఆసక్తి చూపుతారు. ప్రస్తుతం పెళ్ళిళ్ళ సీజన్ కావడంతో బంగారానికి డిమాండ్ పెరిగింది. ఇప్పటిదాకా బంగారం ధరలు పెరగగా తాజాగా తగ్గుముఖం పట్టాయి.

రెండు తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధర భారీగా తగ్గింది.

పది గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర రూ.1000కు పైగా తగ్గి ప్రస్తుతం రూ.52,490 పలుకుతోంది.

మరోవైపు కేజీ వెండి ధర కూడా రూ.2000 మేర తగ్గింది. ప్రస్తుతం రూ.55,310 వద్ద ఉంది.

హైదరాబాద్ లో పది గ్రాముల బంగారం ధర రూ.52,490గా ఉంది. కిలో వెండి ధర రూ.55,310 వద్ద కొనసాగుతోంది.

విజయవాడలో 10 గ్రాముల పసిడి ధర రూ.52,490 వద్ద కొనసాగుతోంది. కిలో వెండి ధర రూ.55,310గా ఉంది.