జియోఫోన్ నెక్స్ట్ ధర ఎంతో తెలుసా? ఈఎంఐ ఆప్షన్​ కూడా..

What is the next price of Geophone? EMI option also ..

0
108

జియోఫోన్ నెక్స్ట్​​ ధరను ప్రకటించింది రిలయన్స్ సంస్థ. ఈ ఫోన్​ ధరను రూ. 6,499గా నిర్ణయించింది. ఈ ఏడాది దీపావళి నుంచి జియోఫోన్ నెక్స్ట్​​ మార్కెట్​లోకి విడుదల కానున్నట్లు తెలిపింది. వినియోగదారులు ముందుగా రూ.1,999 చెల్లించి, ఫోన్​ తీసుకుని..మిగిలిన మొత్తాన్ని ఈఎంఐలుగా కట్టవచ్చని వెల్లడించింది. నాలుగు రకాల ఆఫ్షన్స్​తో ఈఎంఐ సదుపాయం కల్పించనుంది.

జియోఫోన్​ నెక్స్ట్ కోసం గూగుల్​, జియో సంయుక్తంగా సరికొత్త ప్రగతి ఆపరేటింగ్​ సిస్టమ్​ను(ఓఎస్​) రూపొందించాయి. తక్కువ ధరకు గొప్ప అనుభూతిని అందిస్తూనే..అందరినీ ‘ప్రగతి’లోకి తీసుకురావాలనే లక్ష్యంతో జియో, గూగుల్‌లోని అత్యుత్తమ టెకీలు దీనిని అభివృద్ధి చేశారని జియో ప్రతినిధులు వెల్లడించారు.

జియోఫోన్ నెక్ట్స్ హైలెట్స్..

జియోఫోన్​ నెక్స్ట్​ కోసం గూగుల్​, జియో సంయుక్తంగా సరికొత్త ప్రగతి ఆపరేటింగ్​ సిస్టమ్​ను(ఓఎస్) రూపొందించాయి.

క్వాల్​క్రమ్ స్నాప్‌డ్రాగన్ 215 క్యూఎమ్‌215 ప్రాసెసర్‌ను ఉపయోగిస్తున్నారు.

5.45 అంగుళాల హెచ్‌డీ+ డిస్‌ప్లే

3500 ఎంఏహెచ్ బ్యాటరీ సామర్థ్యం

13 ఎంపీ బ్యాక్​ కెమెరా, 8ఎంపీ ఫ్రంట్ కెమెరా

2 జీబీ ర్యామ్‌, 32జీబీ ఇంటర్నల్ మెమొరీ 4జీ నెట్‌వర్క్‌కు సపోర్ట్

ధర.. రూ. 6,499