వినాయక చవితి నాడు పత్రి పూజలో ఈ ఆకులతో తప్పనిసరిగా పూజ చేయండి

వినాయక చవితి నాడు పత్రి పూజలో ఈ ఆకులతో తప్పనిసరిగా పూజ చేయండి

0
171

వినాయక చవితి నాడు విఘ్నేశ్వరుడిని 21 రకాల ఆకులతో పూజిస్తారు… ఆనాడు తోటల్లో అడవుల్లో చాలా మంది ఇవి తీసుకువచ్చేవారు. నేడు మార్కెట్ లో మనకు పత్రి దొరుకుతోంది, అయితే ఈ ఆకులతో ఆ వినాయకుడ్ని పూజిస్తే ఎంతో మంచిది అని చెబుతున్నారు పండితులు.

ఈ సంవత్సరం గణేశ చతుర్తి ఆగస్ట్ 22న శనివారం వస్తోంది. ఆ రోజు రాత్రి 7.57 వరకూ గణేశ చతుర్థి ఉంటుంది.శనివారం మధ్యాహ్నం 12.22 నుంచి సాయంత్రం 4.48 వరకూ అమృత గడియలు ఉన్నాయి.
మరి ఏ పత్రితో పూజ చేయాలి అనేది చూద్దాం.

గరిక
మాచ పత్రి
రేగుఆకులు
ఉత్తరేణి
ఉమ్మెత్త
తులసి
ములక
మామిడి
మారేడు
గన్నేరు
ధవనం- మరువం
జమ్మి ఆకులు
విష్ణుక్రాంత చెట్ల ఆకులు
వావిలి ఆకులు
దానిమ్మ
రావి
జాజిమల్లి
మద్ది
దేవదారు పత్రం
లతాదూర్వా
జిల్లేడు.