వినాయక చవితి రోజు రాత్రి చంద్రుడ్ని చూశారా? ఈ పరిహరం చేస్తే ఏ పాపం తగలదు

వినాయక చవితి రోజు రాత్రి చంద్రుడ్ని చూశారా? ఈ పరిహరం చేస్తే ఏ పాపం తగలదు

0
146

వినాయక చవితి మనకు అతిముఖ్యమైన పండుగలలో ఒక పండగ. పార్వతి, పరమేశ్వరుడు కుమారుడైన వినాయకుని పుట్టినరోజునే వినాయక చవితిగా జరుపుకుంటారు. భాద్రపదమాసము శుక్ల చతుర్థి శుభ సమయంలో హస్త నక్షత్రమున రోజున చవితి ఉత్సవాలు ప్రారంభమవుతాయి. అయితే ఈరోజు వినాయక వ్రత కధ చదువుకుని అక్షింతలు తలపై చల్లుకుంటారు.

బాధ్రపద శుద్ధ చవితి రోజు వినాయకుడికి భక్తులందరూ అనేక రకములైన పిండి వంటలు, కుడుములు, టెంకాయలు, పాలు, తేనె, అరటి పళ్లు, పానకము, వడ పప్పు సమర్పించారు. విఘ్నేశ్వరుడు, తృప్తి పడి తిన్నంత తిని, భుక్తాయాసంతో చీకటి పడే వేళకు కైలాసం చేరు కున్నాడు.

ఈ సమయంలో తల్లి దండ్రులకు వంగి నమస్కారం చేయబోయాడు, తన వల్ల కాలేదు. శివుని శిరస్సుపై ఉన్న చంద్రుడు పక పకా నవ్వాడు. చంద్రుని చూపు సోకి వినాయకుని పొట్ట పగిలి కుడుములన్నీదొర్లు కుంటూ బయటకు వచ్చేసాయి.పార్వతీ దేవి కోపంతో, చంద్రుని ఇలా శపించింది. ఓరి పాపాత్ముడా నీ చూపు తగిలి నా కొడుకు మరణించాడు. అందుకని నిన్ను చూసిన వాళ్లు, పాపాత్ములై నీలాపనిందలు పొందుతారు అని శపించింది.

వినాయక చవితి నాడు చందమామను చూడకూడదనేది ఆచారం ఉంది ఆనాటి నుంచి… పొరపాటున చందమామను చూస్తే… దానికి ప్రతిగా… మర్నాడు పేదలకు తెల్లటి వస్త్రాలు, తెల్లటి ఆహార పదార్థాల వంటివి ఏవైనా దానం చేయాల్సి ఉంటుందని పండితులు చెబుతున్నారు. ఆ చంద్రుడ్ని చూసిన తర్వాత మళ్లీ వినాయకుడ్ని దర్శించి కథ అక్షింతలు తలపై చల్లుకున్న పాపం తొలగిపోవును అంటున్నారు.