దేశంలో కరోనా కేసుల సంఖ్య క్రితం రోజుతో పోలిస్తే స్వల్పంగా తగ్గాయి. కొత్తగా 7,145 కేసులు నమోదయ్యాయి. మరో 289 మంది ప్రాణాలు కోల్పోయారు. 24 గంటల వ్యవధిలో 8,706 మంది కోలుకున్నారు. కానీ కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కేసుల సంఖ్య పెరుగుతుండడం కలవరపెట్టే విషయం.
ఇక దేశవ్యాప్తంగా టీకా పంపిణీ కార్యక్రమం జోరుగా సాగుతోంది. దేశంలో శుక్రవారం వరకు పంపిణీ చేసిన డోసుల సంఖ్య 1,36,66,05,173కు చేరింది. ప్రపంచవ్యాప్తంగా కొవిడ్ తీవ్రత కొనసాగుతోంది. కొత్తగా 7,29,488 మందికి కరోనా సోకగా 7,036 మంది ప్రాణాలు కోల్పోయారు.
భారత్లో కరోనా పరిస్థితులపై మరోసారి దేశ ప్రజలను కేంద్రం హెచ్చరించింది. బ్రిటన్, ఫ్రాన్స్ తరహా పరిస్థితులు మన దేశంలో నెలకొంటే రోజుకు 14 లక్షలకు పైగా కేసులు నమోదు అవుతాయని కరోనా టాస్క్ఫోర్స్ చీఫ్ వీకే పాల్ అన్నారు. కరోనా నిబంధనలు అందరూ కచ్చితంగా పాటించాలని కోరారు.
మొత్తం కేసులు: 34,733,194
మొత్తం మరణాలు: 477,158
యాక్టివ్ కేసులు: 84,565
కోలుకున్నవారు: 3,41,71,471