దేశంలోకి ఎంట్రీ ఇచ్చిన మంకీపాక్స్‌..

0
51

చైనాలో పురుడు పోసుకున్న కరోనా మహమ్మారి అన్ని దేశాలను ఓ ఆట ఆడించింది. అయితే ఈ మహమ్మారి పీడ నుండి ప్రజలు ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న క్రమంలో మంకీపాక్స్ మళ్ళి ప్రజలను భయాందోళనకు గురిచేస్తుంది. అయితే ఇలాంటి పరిస్థితులలో జనాలు కరోనా కొత్త కేసులు తగ్గుతున్నందుకు సంతోషపడాలో లేదా మంకీపాక్స్ విరుచుకుపడుతున్నందుకు బాధపడాలో తెలియని దుస్థితి ఏర్పడింది.

ఈ మంకీపాక్స్ బారీన పడకుండా అప్రమత్తంగా ఉండాలని ప్ర‌పంచ ఆరోగ్య సంస్ధ హెచ్చరిస్తుంది. ఎందుకంటే మంకీపాక్స్‌ కేసులు క్రమక్రమంగా పెరుగుతూ ఉండడంతో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. తాజాగా ఉత్తరప్రదేశ్‌లో మంకీపాక్స్‌ కలకలం రేపింది. ఘజియాబాద్‌కు చెందిన ఓ ఐదేండ్ల బాలిక మంకీపాక్స్‌ లక్షణాలతో బాధపడుతున్నది.

తన ఒంటిపై దురద, దద్దుర్లు వస్తున్నాయని వైద్యులను చిన్నారి సంప్రదించడంతో అధికారులు ఆమె నుంచి నమూనాలను సేకరించి పరీక్షల నిమిత్తం ల్యాబ్‌కు పంపించారు. ఈ ఫలితాల ఆధారంగా మంకీపాక్స్ పై క్లారిటీ రానుందని తెలిపారు. అందుకే అందరు జాగ్రత్తగా ఉండాలని అధికారులు వెల్లడించారు.