కరోనా మహమ్మారి ప్రపంచాన్ని కుదిపేసింది. ఇక కరోనా విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాల్సిందే. ముఖ్యంగా అన్నీ దేశాల్లో కరోనా టీకా ప్రక్రియ శరవేగంగా జరుగుతోంది. తొలి డోసు తీసుకోవడానికి కూడా కోట్ల మంది సిద్దం అయ్యారు. ఇకసెకండ్ డోస్ కూడా చాలా మంది తీసుకున్నారు. అయితే కొత్త వేరియంట్లతో రోజుకో రూపంతో విరుచుకుపడుతోంది కరోనా.
చాలా దేశాలు 50 శాతం వ్యాక్సినేషన్ పూర్తి చేసుకున్నాయి. ఇక టీకా వేసుకొనేందుకు కొందరు ముందుకు వస్తుంటే, మరికొందరు టీకా వేసుకునేందుకు రావడం లేదు. అయితే కొన్ని దేశాలు ఆఫర్లు ప్రకటిస్తున్నాయి. తాజాగా బ్రిటన్ ప్రభుత్వం కొత్త నిర్ణయం తీసుకుంటోందట.
షాపింగ్ వోచర్లు, పిజ్జా డిస్కౌంట్లు, ప్రయాణాల్లో రాయితీలతో వ్యాక్సిన్ వోచర్స్ పథకాన్ని తీసుకొచ్చేందుకు ప్రణాళిక రూపొందించింది. రైడ్-హెయిలింగ్, ఫుడ్ డెలివరీ యాప్‌లు టీకా తీసుకున్న వారికి ప్రయాణ, భోజన రాయితీలు కల్పిస్తున్నాయి. తాజాగా వ్యాక్సిన్ వోచర్స్ పథకంలో ఉబెర్, బోల్ట్, డెలివెరూ, పిజ్జా పిలిగ్రిమ్స్ సంస్థలు కూడా యాడ్ కానున్నాయట. చాలా దేశాలు టీకా ప్రక్రియ వేగవంతం చేసేందుకు ఇలాంటి అనేక ఆఫర్లు ఇస్తున్నాయి.