హోలీ ఎందుకు జరుపుకుంటారు దాని చరిత్ర

హోలీ ఎందుకు జరుపుకుంటారు దాని చరిత్ర

0
210
Holi

History of Holi Festival |హోలీ అనేది రంగుల పండుగ, హిందువుల వసంత కాలంలో వచ్చే ఈ పండుగను భారత దేశంలోనే కాకుండా, నేపాల్, బంగ్లాదేశ్, ప్రవాస భారతీయులు కూడా జరుపుకుంటారు. భారత దేశంలోని పశ్చిమ బెంగాల్, బంగ్లాదేశ్లలో దీన్ని దోల్యాత్రా లేదా బసంత-ఉత్సబ్ అని అంటారు. హోలీ పండుగను బ్రాజ్ ప్రాంతంలో భగవంతుడైన కృష్ణునికి సంబంధిత ప్రదేశాలైన మథుర, బృందావనం, నందగావ్, బర్సానాలలో ఘనంగా జరుపుకుంటారు.

ఈ పండుగ రోజు దాదాపు ఈ ప్రాంతాలు అన్నీ పండుగ సందడితో ఉంటాయి. ఈరోజు ఒకరిపై ఒకరు రంగు నీళ్లు చల్లుకుని పండుగ చేసుకుంటారు, ముందు రోజున హిరణ్యకశ్యపుని చెల్లెలైన హోలిక అనే రాక్షసి బొమ్మకు నిప్పంటిస్తారు. దీనిని హోలిక దహన్ అంటారు, దీనికి పెద్ద ఎత్తున అందరూ పాల్గొంటారు.

హిరణ్యకశిపుని చెల్లెలైన హోలిక(Holi) అనే రాక్షసి ప్రహ్లాదుడిని మంటలలో వేసినప్పుడు దైవలీలతో తప్పించుకుంటాడు అందుకే భోగి మంటలు అంటిస్తారు. హోలిక ఈ మంటలలో దహనమయ్యింది కానీ విష్ణువుకు పరమ భక్తుడైన ప్రహ్లాదుడు, అతని అపార భక్తితో ఎటువంటి గాయాలు లేకుండా తప్పించుకుంటాడు. ఆంధ్ర ప్రదేశ్లో హోలిక దహన్ను కామ దహనం అని అంటారు. ఈరోజు అందరూ తమ ఇష్టదైవాలని పూజిస్తారు.

Read Also: హోలీ రోజు ఏ రంగులు చల్లుకుంటే మంచిదో తెలుసా

Follow us on: Google News