Best Snacks | చిరుతిళ్లు అనగానే గుర్తొచ్చేవి వేడివేడి పకోడి, సమోసా లేదా జంక్ ఫుడ్. మరి డైటింగ్ లో ఉన్నవారి సంగతేంటి? ఆకలిని అణుచుకుని తినే సమయం కోసం వేచిచూడటమేనా? ఆ అవసరమే లేదు.. కొవ్వు తక్కువగా ఉండే ఈ గింజలను తింటే చాలంటున్నారు నిపుణులు.
అవిసె గింజలు: కురుల సంరక్షణకు మంచిదని మనందరికీ తెలుసు. కానీ ఆరోగ్యానికి సహాయపడతాయి అని చాలామందికి తెలియదు. డైటింగ్ లో ఉన్నవారు రోజులో ఒకసారి వేయించిన అవిసె గింజలను తింటే ఆకలిని తరిమి కొట్టేయొచ్చు. జీర్ణ సంబంధిత సమస్యల నుంచి విముక్తి పొందొచ్చు. షుగర్ వ్యాధితో బాధపడుతున్న వారు వీటిని తినడం వల్ల హెచ్చుతగ్గులను నియంత్రించవచ్చు.
చియా సీడ్స్: ఇవి బరువు తగ్గడానికి సరైనవి. ఇందులో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఒమెగా3 కూడా లభిస్తుంది. మధ్యరాత్రిలో ఆకలి వేసినప్పుడు వీటిని తీసుకోవచ్చు. నీటిలో కాసేపు నానబెట్టి తింటే మంచి ప్రయోజనం ఉంటుంది. సబ్జా గింజల్లా కాస్త చక్కెర వేసి తాగినా ఫర్లేదు.
కాబూలీ శనగలు: ఇవి తక్కువ క్యాలరీలతో ఎక్కువ పోషకాలను కలిగి ఉంటాయి. వీటిని కూరల్లోనో, బయట పానీపూరి బండ్ల మీదనో తినుంటాం. ప్రొటీన్లు అధికంగా ఉండే జాబితాలోకి ఇవి కూడా వస్తాయి. ఉడికించినవి లేదా వేపిన కాబూలీ శనగలను చిరుతిళ్లలో(Best Snacks) భాగంగా చేసుకుంటే ఆకలి తీరుతుంది. ఆరోగ్యంగానూ ఉండొచ్చు.
Read Also:
1. లంచ్ బాక్స్ స్పెషల్: హైదరాబాద్ దమ్ కిచిడీ
2. తలలో చుండ్రు తరచూ వస్తుంటే ప్రమాదమా??
Follow us on: Google News, Koo, Twitter, ShareChat