Summer hair tips to control hair fall
- Advertisement -
షాంపూ : సమ్మర్ లో మీ రెగ్యులర్ షాంపూను మార్చడం చాలా ముఖ్యం. మీరు రెగ్యులర్ గా ఉపయోగించే కఠినమైన షాంపూ, సోప్స్ కి తలలోని మురికి వదలడం కాదు కదా.. ఇంకా మీ జుట్టును పొడిగా మార్చేస్తాయి. కాబట్టి మైల్డ్ షాంపూను ఉపయోగించడం మేలు.
కండీషనర్ : ముఖ్యంగా సమ్మర్ లో తలకు డీప్ కండీషనర్ చేసుకోవడం చాలా ముఖ్యం. ఇలా చేయడం వల్ల మీ జుట్టు మృదువుగా, షైనీగా మెరుస్తుంటాయి. చెమట వల్ల వచ్చే చిక్కు నుండి కేశాలను కాపాడుకోవచ్చు.
హైడ్రేషన్ : వేసవిలో అధికంగా నీరు త్రాగడం మరో ముఖ్యమైన విషయం. వేసవి తాపానికి మీ శరీరంలోని నీరంతా చెమట రూపంలో బయటకు వచ్చేస్తుంది. కాబట్టి తిరిగి శరీరం నీటిని, తేమను పొందాలంటే అధికంగా నీరు త్రాగాలి. ఇది జుట్టుకి కూడా చాలా మంచిది.