పురాణాల ప్రకారం హిందూ సంప్రదాయాల్లో ఎన్నో ఆచరాలు, మరెన్నో ధర్మశాస్త్రాలు ఉన్నాయి. ఇప్పటికీ వాటిని ప్రజలు పాటిస్తూ ఉంటారు. మనిషి పుట్టుక దగ్గరి నుంచి చావు వరకు ఆచారాలతో ముడిపడి ఉంది. ఏది చేయాలన్నా పాత కాలం నుంచి వస్తున్న సంప్రదాయాలనే అనుసరిస్తున్నారు. చావు తర్వాత చేసే అంత్యక్రియల్లో(Funeral) కూడా ఓ ఆచారం తప్పక పాటిస్తారు. అంది ఏంటంటే శ్మశాన వాటికల్లో అంత్యక్రియలు చేసిన అనంతరం ఎవరు వెనక్కు తిరిగి చూడకూడదు అని పెద్దలు చెబుతుంటారు. దాని వెనక ఓ కారణం ఉందని పురాణాలు చెబుతున్నాయి. అంతిమ సంస్కారాలు, ఆత్మ మరణానంతర జీవితం గురించి గరుడ పురాణంలో ఉంది. ఈ పురాణం ప్రకారం ఓ వ్యక్తి అంత్యక్రియల(Funeral) నుంచి తిరిగి వెళ్లే క్రమంలో పొరపాటున కూడా వెనక్కి తిరిగి చూడకూడదు. అలా చూడడం వల్ల మరణించిన వ్యక్తి ఆత్మ చూసేవారితో అనుబంధం కొనసాగిస్తుందట. ఈ భూమ్మీద నుంచి తాను అనంతలోకాలకు వెళ్లిపోవడం కారణంగా ఆ వ్యక్తి మాత్రమే విచారంగా ఉన్నాడని ఆత్మ భావిస్తుందట. దీంతో ఆ ఆత్మ శాంతించకుండా వారితో ఉండాలని ఇంటికి తిరిగి రావాలని కోరుకుంటుందని పురాణంలో స్పష్టంగా ఉంది.
Read Also:
1. దీపారాధన ఏ నూనెతో, ఎలా చేస్తే శుభ ఫలితాలు కలుగుతాయి?
2. సెక్స్ తర్వాత ఇలా చేస్తే మీ పార్ట్ నర్ హర్ట్ అయ్యే చాన్స్ ఉంది జాగ్రత్త..!
Follow us on: Google News, Koo, Twitter