24 గంట‌ల్లో ఇద్ద‌రిని వివాహం చేసుకున్న యువ‌తి అంద‌రూ షాక్

24 గంట‌ల్లో ఇద్ద‌రిని వివాహం చేసుకున్న యువ‌తి అంద‌రూ షాక్

0
82

ఈ మ‌ధ్య కొన్ని వివాహాలు చాలా వింత‌గా జ‌రుగుతున్నాయి, సినిమాటిక్ గా కొంద‌రు ప్రియుళ్లు క‌ల్యాణ మండ‌పాల‌కు వెళ్లి నేను ఆ అమ్మాయి కొంత కాలంగా ప్రేమించుకుంటున్నాం, మా పెద్ద‌లు ఈపెళ్లికి ఒప్పుకోవ‌డం లేదు అని మీరే మా పెళ్లి జ‌ర‌పండి అని బాంబ్ పేలుస్తున్నారు.

ఇలాంటి ఘ‌ట‌న‌లు చాలానే జ‌రుగుతున్నాయి, తాజాగా నేడు అలాంటిదే జ‌రిగింది.న‌ల్గొండ‌లో ఇలాంటి వివాహం జ‌రిగింది, ఇక్క‌డ ఓ యువ‌తికి పెద్ద‌లు వివాహం కుదిర్చారు, ఆమెకి ఈ వివాహం ఇష్ట‌మో లేదో ఏమీ క‌నుక్కోలేదు.

చివ‌ర‌కు ఆమె త‌న‌కు మామ‌య్య వ‌రుస అయ్యే వ్య‌క్తిని ప్రేమించింది, చివ‌ర‌కు ఆమెకి తాళిక‌ట్టిన త‌ర్వాత ఆమె మామ వచ్చి, తాను ఆమె ప్రేమించుకుంటున్నాం అని పెళ్లి కొడుకు బంధువుల‌కి చెప్పాడు, అంతేకాదు ఆమె అత‌న్ని ప‌ట్టుకుని ఏడ్చేసింది, దీంతో పెళ్లి కొడుకు ఈ వివాహం ర‌ద్దు చేసుకున్నాడు, ఆమె త‌న మామ‌ని వివాహం చేసుకుంది.