చాలా మంది శాంతి పూజలు చేస్తూ ఉంటారు, అయితే వ్యాపారాల కోసం గ్రామాల బాగుకోసం ఇలా పల్లెల్లో చాలా మంది చేస్తూ ఉంటారు, ఈ సమయంలో గొర్రె మేక కోడిని బలి ఇస్తూ ఉంటారు, వారి ఆచారం ఇలా శాంతి పూజ చేస్తే మంచిది అని నమ్ముతారు, అయితే ఈ వైరస్ వేళ కొందరు గ్రామస్తులు చేసిన పనికి అందరూ షాక్ అవుతున్నారు.
శాంతి పూజల పేరుతో 400 గొర్రెలను బలి ఇవ్వడం పెద్ద చర్చగా మారింది.. కరోనా నిర్మూలన పేరుతో జార్ఖండ్లోని కోడెర్మా జిల్లాలో శాంతి పూజల నిర్వహించారు.. ఈ సందర్బంగా 400 గొర్రెలను బలి ఇచ్చారు. చంద్వారా బ్లాక్ పరిధిలో గల ఉర్వాన్ గ్రామంలోని అమ్మవారి ఆలయంలో ఈ ఘటన జరిగింది. దీనిపై ప్రపంచ వ్యాప్తంగా ఈ వార్త వైరల్ అయింది, ఇదేం పూజ ఇదేం ఆచారం అని అందరూ విమర్శలు చేస్తున్నారు.
కరోనాకి శాంతి పూజలు చేయడం ఏమిటి ..మళ్లి ఇలా బలి ఇవ్వడం ఏమిటి అని అందరూ విమర్శలు చేస్తున్నారు… ఇలా చేస్తే కరోనా నుండి తమ గ్రామానికి విముక్తి కలుగుతుంది అని తమ నమ్మకంగా చెబుతున్నారు. ఎవరూ మాస్క్ పెట్టుకోలేదు భౌతిక దూరం పాటించలేదు, దీనిపై అక్కడ సర్కారు అధికారులు జాగ్రత్తలు తీసుకోవాలి అని నెటిజన్లు కోరుతున్నారు