ఆ ప్రాచీన శివాలయంలో పూజ ఎవరు చేస్తారో తెలిస్తే మతిపోతుంది

ఆ ప్రాచీన శివాలయంలో పూజ ఎవరు చేస్తారో తెలిస్తే మతిపోతుంది

0
99

మన దేశంలో ఎన్నో శివాలయాలు ఉన్నాయి ,నిత్యం శివ పూజలు అందుకునే ఆ శివయ్యకు ఓ ప్రాచీన దేవాలయం ఉంది, అయితే ఇక్కడ ఎవరికి తెలియని ఓ శక్తి దాగి ఉంది అని చాలా మంది నమ్ముతూ ఉంటారు.. ఆ శక్తి తెల్లవారుజామున శివయ్య గుడిలోకి వచ్చి ప్రతిరోజు ఉదయాన్నే పూజారి కన్నా ముందే వచ్చి పూజ చేస్తుంది అని చాలా మంది నమ్ముతూ ఉంటారు.

మధ్యప్రదేశ్ మురైన్ జిల్లా పాహడ్ ఘడ్ లో ఈ శివాలయం ఉంది….ఈ శివ మందిరం అడవి మధ్యలో ఉంది.. అంతేకాదు దట్టమైన ప్రాంతంగా పాహడ్ ఘడ్ ఎంతో పేరు, కాని ఉదయం ఇక్కడ శివుడి దేవాలయానికి వచ్చే పూజారి గుడి తలుపు తెరిచి చూడగానే ఆశ్చర్యంగా అక్కడ శివయ్యకి పూజ చేసి ఉంటుంది, అంతేకాదు అక్కడ పువ్వులు ఆకులు నీరు పోసి అభిషేకం చేసి ఉంటుంది.

వర్షాకాల సమయంలో కూడా ఈ మందిరంలో ఇలా పూజలు జరుగుతూనే ఉంటాయి… గతంలో ఓ మహాముని తపస్సు చేసి అక్కడ శివాలయం స్ధాపించారు, అయితే ఆయన మరణం తర్వాత కూడా ఇక్కడకు ఆయన దైవశక్తితో వచ్చి పూజలు చేస్తున్నారు అని అంటున్నారు…. దాదాపు ఆయన కొన్ని సంవత్సరాలు పూజలు చేయడంతో ఇక్కడ స్వామిపై ప్రేమతో ఆయనే వచ్చి పూజలు చేస్తున్నాడు అని, ఇక్కడ కొన్ని ఏళ్లుగా నమ్ముతున్నారు. అందుకే ఈ దేవాలయానికి ఎంతో పేరు ఉంది.