అక్కడ 80 టన్నుల బంగారం ప్రపంచంలో అతి పెద్ద బంగారు నిధి ఎక్కడంటే

అక్కడ 80 టన్నుల బంగారం ప్రపంచంలో అతి పెద్ద బంగారు నిధి ఎక్కడంటే

0
96

బంగారం ఎంత విలువైనదో తెలిసిందే, అయితే గతంలో కూడా బంగారం వజ్రాలకు చాలా విలువ ఉండేది, అందుకే గత కాలంలో చాలా సొత్తు బంగారం దొంగలపాలైంది అంటారు. అయితే కొందరు నేలమాలిగల్లో దాచేవారు, రాజ్యాల నుంచి చాలా బంగారం కూడా దేశాలు దాటిపోయింది.

మరికొందరు యుద్దాల్లో గెలిచి దానిని సాధించిన వారు ఉన్నారు.. కాని ఫ్రెంచ్ చక్రవర్తి నెపోలియన్ 1812లో మాస్కో నుంచి పారిపోయే సందర్భంలో కొల్లగొట్టిన టన్నుల కొద్దీ బంగారం ఇప్పటికీ చాలా మందికి తెలియదు.

200 ఏళ్లుగా ట్రెజర్ హంటర్స్ దీనికోసం వెతుకుతున్నారు, కాని ఇది ఎవరికి దొరకలేదు… 200 ఏళ్ల క్రితం నెపోలియన్ సైన్యం మాస్కోను లూటీ చేసి ఫ్రాన్స్ పారిపోయేటప్పుడు 80 టన్నుల బంగారం ఇతర విలువైన వస్తువులను దోచుకుంది. అయితే తిరిగి వెళ్లడం కష్టం కావడంతో 400 బండ్లలో ఆ నిధిని ఒక చోట దాచి పెట్టారని కాని తిరిగి దానిని తీసుకువెళ్లలేదు అని అంటారు చరిత్ర కారులు..బోల్డ్షయ్యా రుటాబీస్ చెరువులో అది ఉంది అంటారు… కాని అక్కడ ఏమాత్రం ఈ నిధి లేదు అంటున్నారు చరిత్ర కారులు రీసెర్చ్ చేసే నిపుణులు. కాని ఈ నిధి మాత్రం ఇప్పటికీ ఎవరికి దొరకలేదు. దీనిపై అనేక కథనాలు ప్రచారంలో ఉన్నాయి.