పాలిటిక్స్ లోకి ఎంట్రీ ఇవ్వనున్న అమలాపాల్

పాలిటిక్స్ లోకి ఎంట్రీ ఇవ్వనున్న అమలాపాల్

0
104

తమిళ్ హీరోయిన్ అమలా పాల్ ప్రస్తుతం రాక్షసన్‌ చిత్రంలో విష్ణువిశాల్‌ కి జంటగా నటిస్తోంది. ఇది త్వరలోనే రిలీజ్ కానుంది. ఈ సినిమా ప్రమోషన్లో భాగంగా అనేక విషయాలను వెల్లడించింది. “ఈ సినిమా నాకు విష్ణువిశాల్‌ లాంటి మంచి మిత్రుడుని అందించింది. రాక్షసన్‌ చిత్రంలో నా పాత్రకు నేనే డబ్బింగ్‌ చెప్పుకోవడం ఆనందాన్ని ఇస్తోంది. ఒకరు నటించిన పాత్రకు వేరొకరు డబ్బింగ్‌ చెప్పడం అన్నది బిడ్డను కని వేరొకరికి ఇవ్వడం లాంటిది అనీ అందుకే నా పాత్రకు నేనే డబ్బింగ్‌ చెప్పుకుంటానన్న కండిషన్‌తోనే ఈ చిత్రాన్ని అంగీకరించాను” అని వెల్లడించింది.

చాలా మంది తారలు రాజకీయంలోకి అడుగు పెడుతున్నారు.. మీకూ అలాంటి కోరిక ఉందా? అని ప్రశ్నించగా.. “భవిష్యత్‌లో నేను కచ్చితంగా రాజకీయాల్లోకి వస్తాను” అని స్పష్టం చేసింది. అలాగే “ఆడై” అనే తమిళ చిత్రంలో అందాలు ఆరబోయడంపై అమలను ప్రశ్నించగా.. ఆ చిత్ర కథకు అవసరం అవడం వల్లే అలా నటించాల్సి వస్తోందని చెప్పింది.