అనుష్క శర్మ వేసుకున్న చెప్పుల ఖరీదు తెలిసి అభిమానులు షాక్

Anushka Sharma Branded life Style

0
116

ఏదైనా అనుభవించాలి అంటే పెట్టిపుట్టాలి అంటారు. ధనవంతుల లగ్జరీ లైఫ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇక సినిమా సెలబ్రిటీలు కూడా తమ ఖర్చుని ఏ మాత్రం తగ్గించరు. భారీగానే ఖర్చు చేస్తారు. వారువాడే వాచ్ నుంచి తిరిగే కారు వరకూ అంతా బ్రాండ్ లోనే ఉంటాయి. ఇక బాలీవుడ్ నటుల గురించి ఎంత చెప్పినా తక్కువే. కొందరు హీరోయిన్స్ వాడే హ్యాండ్ బ్యాగ్ ఖరీదు 10 లక్షల వరకూ ఉంటుంది. ఇక యూరప్ నుంచి మన బాలీవుడ్ నటులు అతి ఖరీదైన సెంట్స్, హ్యాండ్ బ్యాగ్స్ కొంటారు.

అయితే టీమ్ ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ , అతని భార్య అనుష్క శర్మ , కూతురు వామిక ఇప్పుడు ఇంగ్లాండ్లో ఉన్నారు. హోటల్ గదిలో నుంచి బయటకు వచ్చిన అనుష్క ఓ ఫోటోని దిగింది. తన ఇన్ స్టాలో ఈ ఫోటో షేర్ చేసింది అభిమానులకి. మన నెటిజన్లు ఆమె అభిమానులు ప్రతీది పసిగడతారు కదా ఇక్కడ అదే చేస్తున్నారు.

అనుష్క చెప్పుల గురించి డిస్కషన్ మొదలు పెట్టారు. అనుష్క శర్మ కొత్త రకం గూచీ చెప్పులు వేసుకుంది. ఇది ప్రపంచంలో టాప్ బ్రాండెడ్ కంపెనీలో ఒకటి. మొత్తానికి ఆన్ లైన్ లో చెప్పుల ధర రూ. 31,892 అని ఉంది, ఇది చూసి ఒక్క రోజు ఖర్చు వీరికి ఈజీగా పది లక్షలు ఉంటుంది అంటున్నారు అభిమానులు.

మీరు చూడండి ఈ పిక్ https://www.instagram.com/p/CPu1oObpGoG/