శబరిమల అయ్యప్ప ఆదాయం ఎంతో తెలిస్తే షాక్

శబరిమల అయ్యప్ప ఆదాయం ఎంతో తెలిస్తే షాక్

0
137

శబరిగిరులు అయ్యప్ప స్వామి పేరుతో మార్మిగిపోతున్నాయి. వేలాది లక్షలాది మంది అయ్యప్ప భక్తులు స్వామి దర్శనం కోసం బారులు తీరుతున్నారు. దేవలోకంగా పేరుగాంచిన స్వర్గభూమి కేరళ, అయ్యప్ప స్వామి శరణుతో మార్మోగుతోంది. ఇప్పటికే రెండు నెలల నుంచి ట్రావెన్ కోర్ కేరళ సర్కార్ అయ్యప్ప భక్తుల కోసం ఏర్పాట్లు చేసి ఎవరికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా స్వామి దర్శనం కల్పిస్తున్నారు.

మూడు షిఫ్టుల్లో ఉద్యోగులు కూడా ఇరుముడి స్వాములకు సాయం చేస్తున్నారు. మరి అయ్యప్ప భక్తులు స్వామికి కానుకలు కూడా అలాగే సమర్పించుకుంటున్నారు. అయితే శబరి మాల ఆలయం తెరిచిన 28 రోజుల్లో భక్తులు హుండీలో వేసిన డబ్బుతోసహా ఇప్పటికే రూ.104 కోట్ల ఆదాయం వచ్చింది. ఇది గుడిలో చరిత్ర అంటున్నారు అక్కడ సిబ్బంది.

2018లో ఆలయం తెరిచిన 28 రోజుల్లో రూ.64 కోట్లు ఆదాయమే వచ్చింది. దీన్ని బట్టీ… ఈసారి దాదాపు డబుల్ ఆదాయం వచ్చిందని అనుకోవచ్చంటున్నారు అధికారులు. రెండు నెలల పాటు ఆలయం తెరిచి ఉంటుంది అయితే ఒక నెల రోజులకే ఈ ఆదాయం రావడంతో ఈసారి స్వామికి కానులు భారీగానే వచ్చాయి అంటున్నారు అధికారులు..హుండీలో నాణేల ద్వారా రూ.5 కోట్ల ఆదాయం రాగా… అన్నదానం, ప్రసాదాల అమ్మకం ద్వారా మొత్తం రూ.104 కోట్ల ఆదాయం వచ్చినట్లు ట్రావెన్ కోర్ట్ దేవస్థాన ట్రస్ట్ తెలిపింది.