పెళ్లి చేసుకోవాలంటే పరీక్ష రాయాల్సిందే ప్రేమికులకు బ్యాడ్ న్యూస్

పెళ్లి చేసుకోవాలంటే పరీక్ష రాయాల్సిందే ప్రేమికులకు బ్యాడ్ న్యూస్

0
108

పెళ్లి అనేది ప్రతి ఒక్కరి జీవితం లో ఒక మధురమైన అనుభూతి. ముఖ్యంగా ఇరు కుటుంబాలు కలిసి ఈ తంతుని నిర్వహిస్తాయి,అందుకే చాలా మంది జీవితంలో సెటిల్ అయిన తర్వాత మాత్రమే పెళ్లి చేసుకుంటున్నారు, సంసారం అనే సాగరంలో ఈదాలి అంటే కష్టనష్టాలు భాధలు అన్నీ తెలియాల్సిందే, అయితే నేటి నవీన సమాజంలో డబ్బు ప్రాధాన్యత మరింత పెరిగింది అందుకే తన కాళ్లమీద తాను నిలబడిన తర్వాతే పెళ్లి అనే ఊసు ఎత్తుతున్నారు యువత. అయితే కుటుంబాల గురించి ఇప్పుడు తెలుసుకునే అంత ఓపిక కొందరికి ఉండటం లేదు, లవ్ మ్యారేజ్ లు చాలా వరకూ జరుగుతున్నాయి, కొందరు మాత్రం కుటుంబాలకు విలువ ఇచ్చి ఏడు తరాల వరకూ చూసుకుంటున్నారు.

ఇక పై ఇంట్లో వాళ్లు ఒప్పుకుంటే పెళ్లి కుదరదు. అదేమిటి కొత్త రూల్ వచ్చింది అని అనుకుంటున్నారా, అవును కాని మన భారత దేశంలో కాదు మరి ఈ వింత చట్టం వేరేదేశంలో తీసుకువచ్చారు.

ఇండొనేసియాలో పెళ్లి చేసుకోవాలంటే మాత్రం కచ్చితం గా కోర్సు చేయాల్సిందే. ఆ కోర్సు పరీక్షలు పాసవ్వాల్సిందే. లేదంటే పెళ్లి జరగదు.
2020 నుంచి ఈ కొత్త రూల్ ను అమలు చేస్తామని ఆ దేశ హ్యూమన్ డెవలప్ మెంట్ అండ్ కల్చరల్ ఎఫైర్స్ విభాగం ప్రకటించింది. పెళ్లి గురించి బార్య భర్త గురించి పిల్లల గురించి ఇలా మూడు నెలల కోర్స్ ఉంటుంది. అది చేసి పరీక్ష పాస్ అయితేనే మీరు పెళ్లి చేసుకోవడానికి అర్హులని సర్టిఫికెట్ ఇస్తారు.

అయితే లవ్ మ్యారేజీలు చేసుకున్నా ఈ సర్టిఫికెట్ ఇద్దరికి ఉండాల్సిందే, ఇటీవల చాలా మంది పెళ్లి చేసుకున్న తర్వాత చిన్న చిన్న విషయాలకు విడిపోతున్నారు. అందుకే ఈ కీలక నిర్ణయం తీసుకుంది అక్కడ ప్రభుత్వం.