జనసేనకు గుడ్ న్యూస్

జనసేనకు గుడ్ న్యూస్

0
74

జనసేన పార్టీ కార్యకర్తలకు గుడ్ న్యూస్…. గతంలో వారిపై నమోదు అయిన కేసును తాజాగా ఉన్నత న్యాయస్థానం కొట్టివేసింది…. గతంలో రాజధాని ప్రాంతం అయిన గుంటూరు జిల్లా దుర్గి మండలం ధర్మవరంలో జనసేన కార్యకర్తలు ప్రదర్శించిన నాటకం వివాదాస్పదం అయిన సంగతి తెలిసిందే…

దీంతో పోలీస్ అధికారులు జనసేన పార్టీకి చెందిన 34 మంది కార్యకర్తలపై హత్యాయత్నం కేసులు నమోదు చేశారు… ఇక దీన్ని సీరియస్ గా తీసుకున్న జనసేన లీగల్ సెల్ హైకోర్టును ఆశ్రయించింది…

లీల్ సెల్ సవాల్ చేస్తూ వేసిన పిటీషన్ తాజాగా విచారణ జరిపిన న్యాయస్థానం జనసేన కార్యకర్తలపై నమోదు అయిన కేసును కొట్టివేసింది… ఘటన పూర్వా పరాలను పరిశీలించకుండా కేసులు ఎలా పెడతారని హైకోర్టు పోలీసులను ప్రశ్నించింది…