త్వరలో పెళ్లిచేసుకోబుతున్న బిగ్ బాస్ ప్రేమ జంట!

త్వరలో పెళ్లిచేసుకోబుతున్న బిగ్ బాస్ ప్రేమ జంట!

0
113

మలయాళ బిగ్ బాస్ రియాలిటీ షోలో శ్రీనిస్ అరవింద్, పర్లే మెనై పీకల్లోతు ప్రేమలో మునిగిపోయారు. ఇటీవల బిగ్ బాస్ వేదికగా తమ ప్రేమను వ్యక్త పరుచుకున్న ఈ జంట.. త్వరలో పెళ్లి చేసుకోబోతున్నాం అంటూ బిగ్ బాస్ హౌస్ నుండి పెళ్లి కబురు చెప్పారు. ఇటీవల జరిగిన ఓ ఎపిసోడ్‌లో శ్రీనిస్ అరవింద్, పర్లే మెనై ఓ కెమెరా దగ్గర నిలబడి మా ఇద్దరి అభిప్రాయాలు బాగా కలవడంతో ప్రేమించుకుంటున్నామని..

త్వరలో పెళ్లి కూడా చేసుకోవాలని ఉందంటూ తమ ప్రేమను అంగీకరించాల్సిందిగా ఇరువురి కుటుంబాలకు రిక్వెస్ట్ చేశారు. ఈ ప్రేమ పెళ్లికి హోస్ట్ మోహన్ లాల్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేయడం మరో విశేషం. ఇరువురి కుటుంబాలతో మాట్లాడి మీ ప్రేమ పెళ్లికి పెద్దగా వ్యవహరిస్తా అని మోహన్ లాల్ హామీ ఇచ్చేయడంతో ఎప్పుడెప్పుడు షో కంప్లీట్ అవుతుందా? పెళ్లి పీటలు ఎక్కేద్దామా? అంటూ ఎదురుచూస్తున్నారు ఈ ప్రేమజంట.