బిగ్ బాస్ 4 లో ఈసారి ఎవ‌రెవ‌రికి చోటు ?

బిగ్ బాస్ 4 లో ఈసారి ఎవ‌రెవ‌రికి చోటు ?

0
77

బిగ్ బాస్ సీజ‌న్ 3 పూర్తి అయింది ఇక మ‌రికొన్ని నెల‌లు అయితే 4వ సీజ‌న్ కూడా స్టార్ట్ అవ్వ‌నుంది, ఇప్ప‌టికే ఆ యూనిట్ నిర్వాహ‌కులు ఎవ‌రిని తీసుకోవాలి అని సంప్ర‌దింపులు కూడా చేస్తున్నారు, ఈసారి చాలా డిఫ‌రెంట్ గా చేయాలి అని చూస్తున్నారు.. బ‌హుశా కొత్త ప్లేస్ లో సెట్ వేస్తారు అని తెలుస్తోంది. ఇక తాజాగా ప‌లువురి పేర్లు తెర‌పైకి వ‌చ్చాయి.

యాంక‌ర్ వ‌ర్షిణి, అల్లరి నరేశ్ .. సుడిగాలి సుధీర్ .. నందూ .. తాగుబోతు రమేశ్ .. ఝాన్సీ ఇలా వీరి పేర్లు వినిపిస్తున్నాయి., ఇప్ప‌టికే కొంతమందితో సంప్రదింపులు పూర్తికాగా, మరి కొందరితో చర్చలు జరుగుతున్నాయని అంటున్నారు. అయితే ఈసారి చాలా వ‌ర‌కూ సీక్రెట్ గా ఉంచుతార‌ట అన్నీ విష‌యాలు గ‌తంలో చాలా వ‌ర‌కూ ముందుగానే రివీల్ అయ్యేవి,

ఎవ‌రు ఎలిమినేట్ అవుతున్నారో కూడా ముందుగా తెలిసేది ఈసారి చాలా జాగ్రత్త‌లు తీసుకుంటారు అని తెలుస్తోంది. ఇక బుల్లితెర నుంచి ఈసారి ఆరుగురికి అవ‌కాశం ఉంటుంద‌ట‌, ఇద్ద‌రు టాప్ సీరియ‌ల్ న‌టుల‌ని కూడా తీసుకుంటారు అని వార్త‌లు వ‌స్తున్నాయి.