అల్లు అర్జున్ కుమారుడు అదరగొట్టాడు ఏం చేశాడంటే

అల్లు అర్జున్ కుమారుడు అదరగొట్టాడు ఏం చేశాడంటే

0
38

బన్నీ తాజాగా సుకుమార్ దర్శకత్వంలో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే, ఇక షూటింగ్ లేకపోవడంతో ఆయన ఇంటికి పరిమితం అయ్యారు, ఈ సమయంలో ఆయన కుటుంబంతో కలిసి ఇంటిలోనే ఉంటున్నారు, ఇక తాజాగా ఆయన కుమారుడు కుమార్తెతో హాలీడేస్ ఎంజాయ్ చేస్తున్నారు.

అయితే తాజాగా బన్నీ వైఫ్ స్నేహరెడ్డి, తన కుమారుడు చేసిన ఓ వంట గురించి తెలిపారు, ఆ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది, అయితే బన్నీ కూతురు కొడుకు కూడా చిన్నతనంలోనే సెలబ్రెటీ పాపులారిటీ సంపాదించుకున్నారు, వారు ఏం చేసినా లక్షల మంది అభిమానులు చూస్తారు.

తాజాగా కుమారుడు అయాన్ చేసిన ఫుడ్ గురించి వీడియో వైరల్ అవుతోంది.తాజాగా బన్నీ తనయుడు అయాన్ చెఫ్ అవతారమెత్తి , సలాడ్ తయారు చేశాడు. ఈ వీడియోను బన్నీ భార్య స్నేహారెడ్డి తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేశారు. పూర్తిగా సలాడ్ ఎలా చేసుకోవాలి, దానికి ఏం ఏం కావాలి ఇలా అన్నీ కూడా వీడియోలో చెబుతూ తయారు చేశాడు అయాన్.