ఛీ మరీ ఇంత నీచమా… టెస్ట్ ల పేరుతో అమ్మాయిలకు దుస్తులను విప్పించి….

ఛీ మరీ ఇంత నీచమా... టెస్ట్ ల పేరుతో అమ్మాయిలకు దుస్తులను విప్పించి....

0
105

గుజరాత్ లో మరో దారుణం జరిగింది… మున్సిపల్ కార్పొరేషన్ లో దాదాపు వందమంది యువతులు మూడేళ్ల క్లర్క్ ఉద్యోగ శిక్షణ పూర్తి చేసుకున్నారు.. ఉద్యోగం శాశ్వితం కావాలంటే ఫిట్ నెస్ టెస్ట్ తప్పని సరి కావడంతో వారికి సూరత్ లోని మున్సిపల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేష్ అండ్ రీసెర్చ్ కు వెళ్లారు…

అక్కడ వైద్యులు వారిని 10 మంది చొప్పున బృందంగా విడదీసింది… ఒక్కో బృందాన్ని లోపలికి తీసుకువెళ్లి వారిని ఒకేసారి దుస్తులను విప్పించి ఉద్యోగినిల పట్ల దారుణంగా ప్రవర్తించడమే కాకుండా గతంలో ఎప్పుడైనా గర్బం దాల్చారా అంటూ అసభ్యంగా ప్రవర్తించారు…

దీనిపై ఉద్యోగినిలు తమ పట్ల దారుణంగా ప్రవర్తించారని వాపోయారు… దీంతో విషయం వెలుగులోకి రావడంతో పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు… కాగా ఇటీవలే నెలసరి సమయంలో హస్టల్ వంట గదిలోకి వచ్చారని విద్యార్థినిలను లోదుస్తులు విప్పించిన సంఘటన మరువకముందే ఈ సంఘటన చోటు చేసుకుంది…