కరోనా ఎఫెక్ట్… నోట్లను కూడా సబ్బుతో కడిగేస్తున్నారు…

కరోనా ఎఫెక్ట్... నోట్లను కూడా సబ్బుతో కడిగేస్తున్నారు...

0
118

కరోనా మహమ్మారి రోజు రోజుకు విస్తరిస్తోంది… దీన్ని అరికట్టేందుకు అనేక చర్యలు తీసుకుంటున్నాకూడా ఈ మహమ్మారి విజృంభిస్తోంది… ఈ వైరస్ గురించి సోషల్ మీడియాలో కొన్ని వీడియోలు వైరల్ అవుతున్నాయి… తాజాగా ఒక వ్యక్తి 5 వందల నోటుతో ముక్కును తుడుచుకున్న ఒక వీడియో వైరల్ అయింది…

దీంతో జానాల్లో తీవ్ర ఆందోళన కలిగిస్తోంది… పలు గ్రామాల్లో ఉన్న వ్యక్తులు కరెన్సీ నోట్లు కడుగుతున్నారు… 100, 500, 2000 నోట్లను సబ్బుతో కడిగి ఆరబెడుతున్నారు… పంట అమ్మగా వచ్చిన డబ్బులను ఈ విధంగా శుభ్రం చేసి ఆరబెడతామని అంటున్నారు…

ఇక దీనిపై అధికారులు స్పందిస్తూ… భయంతోనే ఇలా చేస్తున్నారని తెలిపారు… ఇది ఆహ్వానించ దగ్గ విషయం కాదని అన్నారు… సబ్బుతో నోట్లను కడగడంవల్ల నోట్లు పాడవుతాయని అంటున్నారు..