సైకిల్ దొంగిలించిన కూలీ – యజమానికి లేఖ ? చదివితే కన్నీరే

సైకిల్ దొంగిలించిన కూలీ - యజమానికి లేఖ ? చదివితే కన్నీరే

0
98

ఈ లాక్ డౌన్ చాలా మంది జీవితాలను ఇబ్బందుల్లో నెట్టింది, దాదాపు రెండు నెలల పాటు పనులు లేక ఇబ్బందుల్లో ఉన్నారు ప్రజలు, ఇక ముఖ్యంగా వలస కూలీలు అత్యంత దారుణమైన స్దితిలో ఉన్నారు.. దిల్లీ యూపీ బిహర్ ముంబై ఇలాంటి నగరాల నుంచి తమ సొంత గ్రామాలకు చేరుకునేందుకు నడక దారిని ఎంచుకున్నారు.

ఈ సమయంలో ఓ వలస కూలీ తన సొంత గ్రామానికి వెళ్లేందుకు ఓ సైకిల్ ని దొంగతనం చేశాడు, అంతేకాదు మీ సైకిల్ ని తీసుకువెళుతున్నా నన్ను క్షమించండి అని లేఖ కూడా రాశాడు… ఓ వలస కార్మికుడు 1250కిలోమీటర్ల దూరం ఉత్తర ప్రదేశ్లోని ఇంటికి వెళ్లేందుకు, తను పనిచేసుకుంటూ నివాసం ఉంటున్న రాజస్థాన్లోని భరత్పూర్లో సైకిల్ను దొంగిలించాడు.

వివరాలు చూస్తే, మహమ్మద్ ఇక్బాల్ అనే వ్యక్తి రాజస్థాన్లో భరత్ పూర్ జిల్లాలోని రారా గ్రామంలో సహబ్ సింగ్ అనే వ్యక్తి ఇంటి నుండి సైకిల్ను దొంగిలించాడు. ఈ సమయంలో ఆ యజమాని ఇళ్లు శుభ్రం చేస్తుంటే ఆ లేఖ దొరికింది, నాకు వేరే గత్యంతరం లేక మీ సైకిల్ తీసుకువెళుతున్నా అని రాశాడు, నా కొడుకు కూడా దివ్యాంగుడు నా బాధ అర్దం చేసుకుంటారు అని లేఖలో క్షమించమని రాశాడు.