ఈ యాంకర్ ఇంట్లో ఏం చేస్తుందో తెలిసి షాకైన పోలీసులు

ఈ యాంకర్ ఇంట్లో ఏం చేస్తుందో తెలిసి షాకైన పోలీసులు

0
90

కొందరు యాంకర్లు పాపం వారి బిజీ లైఫ్ తో ఇంటి పని చేసుకోలేరు.. అయితే ఇంటిలో పని కోసం ఎవరిని అయినా పెద్దవారిని పెట్టుకుంటే గౌరవం ..కాని మన దేశంలో చట్టాలు ఉన్నా సరే చిన్నపిల్లల చేత పని చేయించకూడదు అని గట్టిగా లా చెబుతున్నా సరే… ఓ యాంకర్ మాత్రం చిన్న పిల్లల చేత పని చేయించుకుంది.. వారి మైనార్టీ కూడా తీరలేదు వారు మేజర్లు కాలేదు… అయినా వారితో ఇంటిలో పని చేయించుకుంటోంది.

అంతేకాదు ఇంటిలో కూరగాయలు కోయడం నుంచి మొక్కల పెంపకం ఇంటి తడిగుడ్డలు పెట్టడం ఇళ్లు ఊడ్వడం వంట చేయడం ఇలా అన్నీ పనులు చేయించుకుంది… అంతేకాదు కాస్త హద్దు దాటి ఏకంగా ఆ పిల్లల చేత మసాజ్ కూడా చేయించుకుంటుందట. అయితే హస్టల్ నుంచి ఆ ఇద్దరు అమ్మాయిలు మిస్ కావడం వారి తల్లిపై అనుమానం రావడంతో..

పోలీసులు చైల్డ్ లేబర్ అధికారులు ఆ పిల్లల తల్లిని ప్రశ్నిస్తే, ఆ పిల్లల్ని యాంకర్ ఇంట్లో పనికి పెట్టినట్లు తెలిపింది, దీంతో ఆమె ఇంటికి వెళ్లి పిల్లల్ని ఆమె నుంచి రక్షించారు,ఇలాంటి దారుణాలు వెలుగులోకి రావడంతో అందరూ షాక్ అవుతున్నారు, చిన్నపిల్లలతో వెట్టి చాకిరీ చేయించడం పై శిశు సంక్షేమ కమిటీ సీరియస్ అయింది. అంతేకాదు ఆ యాంకర్ పై పలు సెక్షన్లతో కేసులు నమోదు చేశారు.