ఏనుగుకు ఉరిశిక్ష ఎక్కడ ఎప్పుడు ఎందుకు ఎలా?

ఏనుగుకు ఉరిశిక్ష ఎక్కడ ఎప్పుడు ఎందుకు ఎలా?

0
114

సాధారణంగా ఉరిశిక్ష అంటే మనుషులకి వేస్తారు, ఏదైనా తీవ్ర నేరాలు చేస్తే వేస్తారు, కాని జంతువులకి ఉరిశిక్ష ఏమిటి పైగా అన్నింటికంటే పెద్ద జంతువు ఏనుగుకి ఉరిశిక్ష ఏమిటి అని అనుకుంటున్నారా, అవును ఇది నిజమే. దాదాపు రెండు వేల మంది మధ్యన, 1916,సెప్టెంబర్ 13న మేరీ అనబడే ఏనుగును ఉరి తీశారు.

స్పార్క్స్ అనే సర్కస్ కంపెనీలో యాక్టివ్ గా ఉండే ఏనుగే మేరి.అది చాలా సాహసాలు చేస్తుంది, ఈ సమయంలో దాని దంతాలకు నొప్పి చేసింది, కాని కొత్త శిక్షకుడు రావడంతో, అతను తెలియక దాని దంతాలను శూలంతో గుచ్చడంతో అది కోపంతో శిక్షకుడిని లాగి కిందకు పడేసింది.

అంతేకాదు అతనిని తన కాలితో తొక్కింది. శిక్షకుడు అక్కడిక్కడే చనిపోయాడు. ఈ ఏనుగుని ఇలా వదిలితే ఇంకా చాలా మందిని చంపేస్తుంది అని భావించి, దానిపై కాల్పులు జరిపారు, దీంతో అది కూల్ అయింది, కాని జనం మాత్రం దీనిని చంపేయాలి అని అనడంతో , ఓనర్ ఇక చేసేది లేక సెప్టెంబర్ 13, 1916 పెద్ద క్రేన్ తో మేరికి ఉరి వేశారు, రెండు సార్లు తాడు తెగింది, చివరకు మూడోసారి అది చనిపోయింది.