ఏనుగులకు గంజాయి ఇస్తున్నారు.. ఎందుకో తెలిస్తే ఆశ్చ‌ర్య‌పోతారు?

ఏనుగులకు గంజాయి ఇస్తున్నారు.. ఎందుకో తెలిస్తే ఆశ్చ‌ర్య‌పోతారు?

0
101

మ‌నం వింటూ ఉంటాం, గంజాయి మ‌నుషులు తీసుకుంటారు… కాని ఏనుగులు తీసుకోవ‌డం ఏమిటి అని ఆశ్చ‌ర్య‌పోతున్నారా? నిజ‌మే ఈ గంజాయి ఏనుగుల‌కి ఇస్తున్నార‌ట‌, దీనికి కార‌ణం ఉంది అంటున్నారు జూ అధికారులు, అసలు దీని వెనుక ఉన్న వాస్త‌వం ఏమిటి అని తెలుసుకుందాం.

పోలాండ్, వార్నా జూలో ఏనుగులు తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయట.. అందుకే అక్కడి జూ అధికారులు ఏనుగుల ఒత్తిడిని తగ్గించేందుకు గంజాయితో చికిత్స అందిస్తున్నారు.. అక్క‌డ వైద్య ప‌రంగా గంజాయిని ఇస్తున్నార‌ట‌.

అయితే దీనికి కార‌ణం ఉంది, వాటికి ఎందుకు ఒత్తిడి ఉంది అనేది కూడా ప‌రిశీలించారు.
గత మార్చిలో జూలోని ఆడ ఏనుగు ఎర్నా చనిపోయింది.. అది తీవ్ర ఒత్తిడితో చనిపోయిందని జూ అధికారులు గుర్తించారు.. దీంతో మిగిలిన ఏనుగులు కూడా దిగులుగా ఉంటున్నాయి, అందుకే ఇలా జూలోని మూడు ఆఫ్రికన్‌ ఏనుగులకు లిక్విడ్ రూపంలో అధిక సాంద్రత కలిగిన రిలాక్సింగ్‌ కెన్నిబినాయిడ్‌ను తొండాల ద్వారా ఇస్తున్నారు..అవి కాస్త కోలుకుంటున్నాయ‌ట‌.