ముఖం అందంగా కాంతి వంతంగా మెరవాలి అంటే రాసుకోండి ఫెయిర్ అండ్ లవ్ లీ అంటూ యాడ్ వస్తుంది, దీంతో దేశంలో చాలా మంది ఈ క్రీమ్ కు ఫ్యాన్స్ అయ్యారు, కచ్చితంగా అమ్మాయిలు రెడీ అయితే వారి హ్యాండ్ బ్యాగ్ లో అలాగే మేకప్ కిట్ లో ఈ క్రీమ్ ఉంటుంది.
హెచ్‌యూఎల్ కంపెనీ తాజాగా ఫెయిర్ అండ్ లవ్లీ ఫేస్ క్రీమ్ పేరును మార్చేసింది. దీనికి గ్లో అండ్ లవ్లీ అని పేరు పెట్టింది. ఇకపై మీరు ఫెయిర్ అండ్ లవ్లీని గ్లో అండ్ లవ్లీ అని పిలవాల్సి ఉంటుంది. ఇక ఈ పేరుపై యాడ్స్ మారతాయి, కచ్చితంగా దీనికి ఇక పై యాడ్ కూడా గ్లో అండ్ లవ్లీ యాడ్ వస్తుంది.
అమెరికాలో బ్లాక్ లైవ్స్ మేటర్ నిరసనల కారణంగా జాన్సన్ అండ్ జాన్సన్ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. దీంతో అమెరికాలో స్కిన్ లైటనింగ్ ప్రొడక్టుల అమ్మకాలను నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. ఇప్పుడు భారత్‌లోని స్కిన్ వైటనింగ్ బ్రాండ్లకు కూడా ఈ సెగ తాకినట్లు కనిపిస్తోంది. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నారు,ఈ కంపెనీ 1975 నుంచి మార్కెట్లో దీనిని తీసుకువచ్చింది, దాదాపు 45 ఏళ్లకు పేరు మార్చింది కంపెనీ..