ఐదు పైసలకే చికెన్ బిర్యానీ.. క్యూ కట్టిన జనం – దీని వెనుక ప్లాన్ ఇదే

ఐదు పైసలకే చికెన్ బిర్యానీ.. క్యూ కట్టిన జనం - దీని వెనుక ప్లాన్ ఇదే

0
140

అసలు చెలామణిలో లేని నాణాలు ఐదు పైసలు, మన వారికి చిన్నతనంలో కూడా కొందరు మాత్రమే వాడి ఉంటారు.. ఎప్పుడో ఇవి వాడుక ఆగిపోయింది, అయితే ఇప్పుడు ఈ ఐదు పైసలు ఉన్నవారు మాత్రం ఏకంగా ఓ ఫుల్ ప్లేట్ బిర్యాని తినవచ్చు, అవును తాజాగా తమిళనాడులో ఓ చోట ఐదు పైసలు కాయిన్ తెస్తే బిర్యాని అని చెప్పారు, అంటే ఐదు పైసలు ఇస్తే బిర్యాని ఇస్తారు.

దీంతో పెద్ద ఎత్తున క్యూకట్టారు జనం, కేవలం ఐదు పైసలు కాయిన్ ఎవరు తెస్తే వారికి మాత్రమే ఇచ్చారు.. రామనాథపురం జిల్లాలో జిల్లా కేంద్రంతో పాటు పనైకులం కీలక్కరై వంటి ప్రాంతాల్లో ప్రసిద్ధి చెందిన బిర్యానీ సెంటర్లు ఉన్నాయి.

తాజాగా ఈ పోటీ ప్రపంచంలో ఇక్కడ కొత్తగా రామనాథపురం ఈస్ట్ కోస్ట్ రోడ్డులో ఓ బిర్యానీ హోటల్లో ఐదు పైసలకే చికెన్ బిర్యానీతో పాటు వంకాయ కుర్మా పెరుగు పచ్చడి పెడుతున్నట్లు ప్రకటన ఇచ్చారు. అయితే అది కొత్త హోటల్, ఓపెనింగ్ ఆఫర్ గా ఇలా చెప్పారు, అంతే ఐదు పైసల హోటల్ అంటూ ఫేమస్ అయింది, దాదాపు 150 మంది ఇలా కాయిన్స్ తెచ్చి బిర్యానీ తిన్నారు.
హోటల్ గురించి అందరికీ ప్రచారం చేసేందుకు ఇక్కడ మంచి ఫుడ్ దొరుకుతుంది.. అని చెప్పేందుకే ఐదు పైసలుకే బిర్యానీ అందించినట్లు చెప్పారు. ఇక ఆ కాయిన్స్ కి ఇప్పుడు గిరాకి ఉండి ఉంటుంది. అందుకే అతను ఐదు పైసలకి బిర్యాని ఇస్తున్నాడు అని మరికొందరు అనుకున్నారు.