న‌గ‌ల వ్యాపారి వ్యాపారం లేక ఏం చేస్తున్నాడో చూసి క‌స్ట‌మ‌ర్లు షాక్

న‌గ‌ల వ్యాపారి వ్యాపారం లేక ఏం చేస్తున్నాడో చూసి క‌స్ట‌మ‌ర్లు షాక్

0
93

నిజ‌మే ప‌రిస్దితులు ఎప్పుడైనా మార‌చ్చు, పూలు అమ్మిన చోటే కట్టెలు అమ్మడం అంటే ఇదేనేమో జైపూర్ కు చెందిన ఓ నగల వ్యాపారి లాక్ డౌన్ నేపథ్యంలో 40 రోజులుగా షాప్ తియ్య‌క‌పోవ‌డంతో ఇంట్లో పోష‌ణ‌కు ఇబ్బంది ప‌డ్డాడు.. దీంతో అత‌ను న‌గ‌లు అమ్మేచోట ఇప్పుడు కూర‌గాయ‌లు అమ్ముతున్నాడు.

దీంతో న‌గ‌లు అమ్మ‌కాలు లేక తాను ఈ అమ్మ‌కం చేస్తున్నాను అని ఈ నగ‌ల త్రాసులో బంగారం కాకుండా దుంప‌లు కూర‌గాయ‌లు వేసి తూకం వేసి ఇస్తున్నాను అని బాధ‌ప‌డ్డాడు, మొత్తానికి జైపూర్ కు చెందిన హుకుంచంద్ సోనీ గత 25 ఏళ్లుగా నగల దుకాణం నడుపుతున్నాడు. కాని పెద్ద న‌గ‌దు వెన‌క వేసుకోలేదు దీంతో త‌న‌కు ఈ ప‌రిస్దితి వ‌చ్చిందని తెలిపాడు.

నగల వ్యాపారంలో తాను పెద్దగా పొదుపు చేసింది ఏమీ లేదని, అందుకే కూరగాయలు అమ్ముకుంటున్నానని వివరించాడు. ఇప్పుడు అత‌ని ప‌రిస్దితి చూసి అంద‌రూ షాక్ అయ్యారు, ఈ లాక్ డౌన్ చివ‌ర‌కు ఎంత ప‌ని చేసిందో అనేది, ఇలా చాలా కుటుంబాల‌కు క‌ళ్ల‌కు క‌నిపిస్తున్నాయి.