మాకు ఎంగేజ్ మెంట్ అవ్వలేదు

మాకు ఎంగేజ్ మెంట్ అవ్వలేదు

0
166

తెలుగు హీరో రామ్ టాప్ హీరోయిన్ తో పీకల్లోతు ప్రేమలో పడ్డారని, వారిద్దరికీ ఎంగేజ్ మెంట్ జరిగిందని కొంతకాలం క్రితం ఓ వార్త హల్ చేసిన సంగతి తెలిసిందే. ‘పండగచేస్కో’ చిత్రంలో రామ్, రకుల్ ప్రీత్ సింగ్ జంటగా నటించారు. తాజాగా ఈ విషయమై స్పందించిన రామ్.. ఈ న్యూస్ లో ఎలాంటి నిజం లేదని.. రకుల్ తో ఒక సినిమాలో కలిసి నటిస్తే ఇలా రూమర్స్ పుట్టిస్తారా అని ప్రశ్నించాడు. రకుల్ తనకు అంత క్లోజ్ కూడా కాదు. మరి అలాంటి గాసిప్స్ ఎందుకు వస్తాయి అర్థం కాదు అన్నాడు. అలాంటివి ఎవరో ఒకరిద్దరు అనుకుని పుట్టించిన గాసిప్స్ ను పట్టించుకోనని చెప్పాడు. తనపై వచ్చే గాసిప్స్ గురించి అన్నయ్య, స్నేహితులు చెబుతూ ఉంటారని అన్నాడు.

ఇక ఇంట్లో అక్కలు వదినలు తనను ‘నీ మీద గాసిప్స్ రావడం లేదేంటి’ అని టీజ్ చేస్తుంటారని చెప్పాడు. అయితే తనకు ఇంతవరకూ ఏ అమ్మాయీ కనెక్ట్ కాలేదని, తనకు ఎవరైనా నచ్చితే, అర్ధరాత్రి పూట మీడియాకు ఫోన్ చేసి విషయం చెబుతానని అన్నాడు. తనకు స్నేహితులు చాలా తక్కువని, బయటకు పెద్దగా వెళ్లేది లేదని, ఖాళీ దొరికితే కుటుంబ సభ్యుల మధ్యే ఉంటానని కూడా రామ్ చెప్పాడు. తాజాగా ఈ యంగ్ హీరో నటించిన చిత్రం ‘హలో గురూ ప్రేమ కోసమే’ అక్టోబర్ 18న విడుదల కానుంది. ప్రేమ కోసం ఓ కుర్రాడు ఏం చేశాడనే కథతో సినిమా రూపొందిందని రామ్ తెలిపాడు.