హనీమూన్ కు వెళ్లి లాక్ డౌన్ లో చిక్కుకున్న జంట ఏమైందంటే

హనీమూన్ కు వెళ్లి లాక్ డౌన్ లో చిక్కుకున్న జంట ఏమైందంటే

0
106

పెళ్లి అయిన తర్వాత ఎవరైనా హనీమూన్ కి వెళ్లాలి అని అనుకుంటారు.. ఈ సమయంలో వారి ఆర్దిక స్దితి బట్టీ మన దేశం లేదా ఇతర దేశాల్లో ఏదైనా మంచి టూరిస్ట్ హబ్ లేదా సూపర్ ప్లేస్ కు వెళతారు, తాజాగా లాక్ డౌన్ కు ముందు ఓ జంట ఇలా వివాహం చేసుకుని హనీమూన్ కి వెళ్లింది.

ఇలా పెళ్లి అయిన వెంటనే . మలేషియాకు వెళ్లేందుకు రాను పోను టికెట్లు కూడా బుక్ చేసుకున్నారు. అయితే వారం రోజులు హనీమూన్ ప్లాన్ చేసుకోగా .ఏకంగా వారికి 68 రోజులు పట్టింది. నవరంగపూర్ జిల్లాలో చోటుచేసుకుంది. ఓ జంట వివాహం చేసుకుని తర్వాత మలేషియా వెళ్లారు.

అక్కడ హనీమూన్ ఎంజాయ్ చేశారు, కాని తిరిగి ఇండియా వద్దామని అనుకునేసరికి లాక్ డౌన్ తో విమాన రాకపోకలు నిలిచిపోయాయి, దీంతో మలేషియా ప్రభుత్వం అక్కడే వారికి వసతి ఏర్పాట్లు చేసింది. చివరికి వందే భారత్ మిషన్లో భాగంగా ఈ నవ దంపతులు దాదాపు 68 రోజుల తరువాత ఇంటికి చేరుకున్నారు. దీంతో వారిని చూసి కుటుంబ సభ్యులు ఆనందించారు.