హైదరాబాద్ లో దారుణం కన్నీరు తెప్పిస్తున్న యువతి సూసైడ్ నోట్….

హైదరాబాద్ లో దారుణం కన్నీరు తెప్పిస్తున్న యువతి సూసైడ్ నోట్....

0
105

హైదరాబాద్ లో దారుణం జరిగింది… జీడిమెట్లలో ఓ యువతికి తన చిన్నతనంలోనే తల్లిదండ్రులు మరణించడంతో అమ్మమ్మ దగ్గర ఉంటోంది… ప్రస్తుతం ఆ యువతి ఇంటర్ సెకెండ్ ఇయర్ చదువుతోంది.. చిన్న తనం నుంచి ఒంటరిగా గడిపిన ఆ యువతికి నెహ్రూనగర్ కు చెందిన ఒక యువకుడు పరిచయం అయ్యాడు…

ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది ఇద్దరు ఒకరినొకరు ఎంతో ప్రేమించుకున్నారు.. ఇక యువతికి ఇంటర్ పరీక్షలు దగ్గరకు రావడంతో బాగా చదువుకోమని చెప్పి యువకుడు కొంతకాలంగా దూరంగా ఉన్నాడు… అతని ప్రేమలో నిండా మునిగిపోయిన యువతి అతడు మాట్లాడకుంటే ప్రతీక్షణం ఓ నరకంలా అనిపించసాగింది…

ఇక దీనికి తోడు గల్లీలో పోకిరీలు వేధిస్తున్నారు… రానురాను పోకిరీల వేధింపులు ఎక్కువ అవ్వడంతో ఆ యువతి ఆత్మహత్య చేసుకుంది… విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు… చుట్టుపక్కల చెప్పిన వివరాల బట్టి కఠిన చర్యలు తీసుకోబోతున్నట్లు తెలుస్తోంది…