అఖిల్ సినిమాలో కాజల్ గెస్ట్ రోల్

అఖిల్ సినిమాలో కాజల్ గెస్ట్ రోల్

0
93

డైరెక్టర్ వెంకీ అట్లూరి దర్శకత్వంలో అఖిల్ ఓ చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రంలో నిధి అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తోంది. కాగా ఈ చిత్రానికి సంబంధించిన ఓ ఆసక్తికర వార్త ఇప్పుడు టాలీవుడ్‌లో హల్‌చల్ చేస్తోంది. అదేంటంటే ఈ చిత్రంలో టాప్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ అతిథి పాత్రలో కనిపించనుందట.

ఓ కీలక పాత్ర కోసం కాజల్‌ను కలవగా.. అందులో నటించేందుకు ఆమె ఒప్పుకున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ ఇదే నిజమైతే సినిమాకు మరింత క్రేజ్ రావడం ఖాయం. ఇక రొమాంటిక్ లవ్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని బీవీఎస్‌ఎన్ ప్రసాద్ నిర్మిస్తుండగా.. థమన్ సంగీతం అందిస్తున్నాడు. క్రిస్మస్ కానుకగా ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.