బిగ్ బాస్ షోకు ఎంత పేరు ఉందో తెలిసిందే. ఇక తెలుగులో బిగ్ బాస్ షోకు ఇప్పటికే ముగ్గురు హోస్టులు వచ్చారు. కానీ తమిళ బిగ్ బాస్ షోకి మాత్రం ఫస్ట్ నుంచి ఒకరే హోస్ట్ ఉన్నారు. ఆయనే లోకనాయకుడు కమల్ హాసన్ .తొలి సీజన్ నుంచి మొన్న పూర్తైన నాలుగో సీజన్ వరకు ఆయనే హోస్ట్ . మంచి టీఆర్పీ తీసుకువచ్చారు. ఇక ఇంటి సభ్యులతో చాలా సరదాగా మాట్లాడుతూ సందడి చేసేవారు కమల్.
చెప్పాలంటే సౌత్ ఇండియా ఆడియన్స్ కూడా ఈ కాన్సెప్టుకు ఫిదా అయిపోయారు.
తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళంలోనూ బిగ్ బాస్ షో దూసుకుపోతోంది.
తెలుగులో ఫస్ట్ సీజన్ ఎన్టీఆర్. రెండో సీజన్ నాని, మూడు నాలుగు సీజన్స్‌కు నాగార్జున ఉన్నారు.
కన్నడలో సుదీప్, మలయాళంలో మోహన్ లాల్, తమిళంలో కమల్ హాసన్ ఈ షోలను నడిపిస్తున్నారు.
బిగ్ బాస్ 5 తమిళ్ నుంచి కమల్ తప్పుకుంటారు అనే వార్తలు కోలీవుడ్ లో వినిపిస్తున్నాయి. దీనికి కారణం ఆయన వరుసగా సినిమాలు చేయాలి అని చూస్తున్నారట. అయితే ఆయనే బిగ్ బాస్ కి కొనసాగాలి అని అభిమానులు కోరుకుంటున్నారు. ఇది గాసిప్ అని నమ్మక్కర్లేదు అని కొట్టిపారేస్తున్నారు కమల్ అభిమానులు.Ta