కేరళలోని అనంత పద్మనాభ స్వామి ఆలయం మన దేశంలో ఇప్పటి వరకూ ఏ దేవాలయంలోని లేని సంపద ఇక్కడ ఉంది, ఆనాటి ప్రభువులు రాజులు ఆ పద్మనాభుడికి ఇచ్చిన బంగారం విలువ వెలకట్టలేనిది.ఆలయంలోని నేలమాళిగలలో ఇప్పటికే ఐదు గదులు తెరిచారు.
ఈ ఐదుగదుల్లో సుమారు లక్ష కోట్ల ఆస్తుల వరకు కనుగొన్నారు, ఇక ఆరోవ గది ఉంది, దానిని తెరవడానికి ప్రయత్నించినా దానికి నాగబంధం ఉండటంతో వెనకడుగు వేశారు, ఇక నాగబంధం ఉంది కాబట్టి అందులో అంతకంటే విలువైన ఆస్తి ఉంది అంటున్నారు అందరూ.
ఆరో గదిని తెరవకూడదని దానికి నాగబంధం ఉందని భక్తులు, ట్రావెన్ కోర్ వంశీయులు చెబుతున్నారు.
దీనికి సుప్రీం కోర్టు కూడా ఆరవ గది తెరవద్దు అని తెలిపింది. ఇక ఆరవగది తెరవాలా వద్దా అనేది ఓ కమిటి నిర్ణయించి చెబుతుంది, అందులో ట్రావెన్ కోర్ వారసులు ఉంటారు, దీని పై వారి నిర్ణయం ఫైనల్ అని తెలిపింది, దీంతో అసలు ఈ ఆరవగది రహస్యం తెలుస్తుందా లేదా అనేది చూడాలి.