కేరళలో కరోనా అనుమానిత వ్యక్తి మృతి అతని మృతదేహం ఏం చేశారంటే

కేరళలో కరోనా అనుమానిత వ్యక్తి మృతి అతని మృతదేహం ఏం చేశారంటే

0
94

మన దేశంలో ఇప్పటి వరకూ కరోనా సోకి ఎవరూ మరణించలేదు.. కాని తొలిసారిగా కేరళ రాష్ట్రంలోని పయ్యన్నూర్ పట్టణంలో ఓ కరోనా అనుమానిత మరణం సంభవించింది. గత కొద్ది రోజుల క్రితం కరోనా వైరస్ సోకిందేమో అన్న అనుమానంతో ఐసోలేషన్ వార్డ్ లో ప్రత్యేక చికిత్స తీసుకుంటూ మృతి చెందాడు ఓ వ్యక్తి..

అతను మలేషియా నుంచి ఇటీవల కేరళ వచ్చాడు, అయితే అతను తీవ్ర జలుబుతో ఇబ్బంది పడటంతో ఆస్పత్రికి వెళ్లాడు.. ఈ సమయంలో అతనికి ప్రత్యేక చికిత్స అందించారు…పూణేలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీలో అతని రక్తం పరీక్షించగా అతనికి కరోనా వైరస్ లేదని తెలిసింది… కాని ఆయనకు కరోనా వైరస్ లక్షణాలు కనిపించాయి అని డాక్టర్లు చెప్పారు.

దీంతో రిస్క్ ఎందుకు అని అనుమానిత రోగికి అత్యంత భారీ భద్రత మధ్య అంత్యక్రియలు నిర్వహించారు, అతని మృతదేహాన్ని పలు పొరల వస్త్రంతో పాటుగా పాలిథీన్ కవర్ల లో చుట్టారు. అలాగే కుటుంబ సభ్యులకి బంధువులకి స్నేహితులకి అతని మృత దేహాన్ని రెండు మీటర్ల దూరం నుంచే కడచూపు చూసేందుకు పదినిమిషాల సమయం మాత్రమే ఇచ్చారు.ఇక వైద్యులు కూడా చాలా జాగ్రత్తగా వారికి ట్రీట్మెంట్ అందిస్తున్నారు.