లాక్ డౌన్ క‌ష్టాలతో పాటు ఆ ఇంటికి మ‌రో క‌ష్టం

లాక్ డౌన్ క‌ష్టాలతో పాటు ఆ ఇంటికి మ‌రో క‌ష్టం

0
101

క‌రోనా వ‌ల్ల చాలా కుటుంబాలు ఇబ్బంది ప‌డుతున్నాయి, ఆర్ధికంగా వారికి చాలా ఇబ్బందులు ఉన్నాయి, ఇక లాక్ వ‌ల్ల క‌రోనా కంట్రోల్ అవ్వ‌డం ఏమో తెలియ‌దు కాని కుటుంబాలు మాత్రం ఆక‌లి కేక‌లు పెడుతున్నాయి, ప‌నిలేక చేతిలో న‌గ‌దు లేక దిక్కుతోచ‌ని స్దితిలో ఉన్నారు జ‌నం.

తెలంగాణ‌లో ఓ యువ‌తి ఏకంగా ఆత్మ‌హ‌త్య చేసుకుంది, ఇక్క‌డ ప‌రిగిలో ఓ కుటుంబం నివ‌శిస్తోంది, భ‌ర్త కారు డ్రైవ‌ర్, ఆమె ఇంటిలోనే ఉంటుంది.. ఇద్ద‌రు పిల్ల‌లు, కాని ఉపాధి లేక 40 రోజులుగా భ‌ర్త ఇంటిలో ఉన్నాడు, ఇక రెండో లాక్ డౌన్ స‌మ‌యానికి ఇంటిలో ఉన్న బంగారం తాక‌ట్టుపెట్టి అప్పులు తీర్చి వ‌డ్డీలు కట్టారు.

ఉన్నా దానితో తిన్నారు, కాని మూడో లాక్ డౌన్ అయ్యేస‌రికి వారి ద‌గ్గ‌ర న‌గ‌దు లేదు, ఆర్ధిక ఇబ్బందులు చుట్టుముట్ట‌డంతో ఆమె ఇంటిలో కిరోసిన్ పోసుకుని ఆత్మ‌హ‌త్య చేసుకుంది, క‌రోనా వ‌ల్ల ఆర్ధిక ఇబ్బందులు వ‌చ్చాయ‌ని, చివ‌ర‌కు త‌న భార్య ఇలా చేసుకుంది అని భర్త క‌న్నీరు మున్నీరు అయ్యాడు, ఇరుగుపొరుగువారికి సాయం అడిగినా చేసేవారు, కాని ఆమె ఎవ‌రిని అడ‌గ‌కుండా ఇలాంటి నిర్ణ‌యం తీసుకుంది అని. క‌న్నీరు మున్నీరు అవుతున్నారు స్ధానికులు. త‌ల్లిలేని పిల్ల‌లు అయ్యారు ఆ చిన్నారులు.