ఈ లాక్ డౌన్ వేళ అందరూ ఇంటి పట్టున ఉంటున్నారు… ఎవరికి ఉపాధి లేదు, ఎలాంటి సౌకర్యాలు లేక వలస కూలీలు తమ సొంత గ్రామాలకు చేరుకునేందుకు, కాలినడకన వెళుతున్నారు… అయితే ఇలాంటి వలస కూలీలకు మన దేశంలో చాలా చోట్ల సాయం అందిస్తున్నారు సామాన్య జనం, ప్రభుత్వాలతో పాటు ఇలా చారిటీలు కూడా సాయం చేస్తున్నాయి, ఓ ఆటో డ్రైవర్ కూలీలకు ఎంతో సాయం చేస్తున్నాడు.
పూణెకు చెందిన అక్షయ్ ఆటో డ్రైవర్, అయితే తన వివాహం మార్చి 25 న జరగాల్సి ఉంది, కాని లాక్ డౌన్ తో వివాహం ఆపేశారు, ఇక పలు డేట్లు మారుతూ వచ్చింది, చివరకు లాక్ డౌన్ అయ్యాక వివాహం చేసుకుంటాను అని తల్లిదండ్రులకి చెప్పాడు, ఇలా ఆటో నడుపుతూ తాను దాచుకున్న రెండు లక్షలతో వివాహం చేసుకుందాం అనుకున్నాడు.
కాని ఈ లాక్ డౌన్ తో వలస కూలీల బాధలు చూసి ఆ నగదుతో పేదల ఆకలి తీర్చాడు, రోజుకి 400 మందికి అన్నం పెట్టాడు, ఇలా తన స్నేహితులు కూడా తనకి సాయం చేశారు, మే 10వరకూ తన దగ్గర నగదు సరిపోయిందట, తర్వాత స్నేహితులు నగదు ఇచ్చారట, ఇక తను చేస్తున్న సేవ చూసి అందరూ శభాష్ అంటున్నారు.