మంచినీళ్లు అనుకుని శానిటైజన్ తాగిన ప్రభుత్వ ఉద్యోగి

మంచినీళ్లు అనుకుని శానిటైజన్ తాగిన ప్రభుత్వ ఉద్యోగి

0
94

ఒక వ్యక్తి మంచి నీళ్లు అనుకుని శానిటైజర్ తాగి మృతి చెందాడు…. ఈ సంఘటన విశాఖపట్నం జిల్లాలో జరిగింది… పూర్తివివరాలు ఇలా ఉన్నాయి.. నక్కపల్లి తహసీల్దార్ కార్యాలయంలో అటెండర్ గా పనిచేస్తున్న సత్తిబాబు అనే వ్యక్తి మధ్యాహ్నం సమయంలో దాహం వేసింది…

పొరపాటున అతను మంచి నీళ్లు అనుకుని అక్కడ ఉన్న శానిటైజర్ ను తాగాడు… దీంతో అతను అస్వస్థతకు గురి అయ్యాడు.. వెంటనే అతన్ని అక్కడ ఉన్న స్థానికులు ఆసపత్రికి తరలించి చికిత్స అందించారు…

చికిత్స తర్వాత ఇంటికి వెళ్లిన అటెండర్ సత్తిబాబు ఆరోజు రాత్రి వాంతులు విరేచనాలు కావడంతో హుటా హుటీన కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించారు అక్కడ ఆయన చికిత్స పొందుతూ తెల్లవారు జామున మృతి చెందాడు…