మైనర్ బాలికని లేపుకువెళ్లాడు, చివరకు ఆమె పేరెంట్స్ చేసిన పనికి గ్రామమే షాక్

మైనర్ బాలికని లేపుకువెళ్లాడు, చివరకు ఆమె పేరెంట్స్ చేసిన పనికి గ్రామమే షాక్

0
147

ఈ రోజుల్లో ప్రేమకి వయసు తారతమ్యాలు లేవు, ఇక స్కూల్ నుంచి ప్రేమలు పెళ్లిళ్లు జరిగిపోతున్నాయి, తాజాగా పంజాబ్ లో ఓ యువకుడు చేసిన పని తెలిస్తే షాక్ అవుతారు.మైనర్ బాలికను లేపుకుపోయిన యువకుడి పట్ల మైనర్ బాలిక కుటుంబ సభ్యులు అమానుషంగా ప్రవర్తించారు. మా అమ్మాయిని లేపుకుపోతావా అంటూ శివాలెత్తారు.

పంజాబ్లోని లూధియానా కూమ్ కలాన్ ప్రాంతానికి చెందిన ఓ యువకుడు అదే ప్రాంతంలో నివసిస్తున్న మైనర్ బాలికను ప్రేమించాడు. ఆమె కూడా అతనంటే ఇష్టం చూపింది, అయితే పెద్దలు ఒప్పుకోరు అని ఈ లాక్ డౌన్ సమయంలో ఆమెని తీసుకుని పారిపోయాడు.

దీంతో మైనర్ బాలిక కుటుంబం తన కూతురు తప్పిపోయిందంటూ జూన్ 8న పోలీసులకు ఫిర్యాదు చేశారు. మొత్తానికి ఆమె కుటుంబ సభ్యులు వారి జాడ గుర్తించి అక్కడకు వెళ్లారు..ఉదయం గ్రామానికి తీసుకొచ్చి యువకుడిని చెట్టుకు కట్టేశారు. మూఖానికి నల్లరంగు పూసి అతడి మెడలో చెప్పుల దండను వేశారు. చితక్కొట్టి పోలీసులకి అప్పగించారు, ఇప్పుడు ఈ వివాదం స్టేషన్ లో ఉంది.