మనం నిత్యం మొబైల్ ఫోన్ లేనిదే బయటకు వెళ్లలేకపోతున్నాం… మన శరీరంలో ఓ పార్ట్ గా మొబైల్ మారింది అని చెప్పాలి, ఈ లాక్ డౌన్ వేళ మనకు బాగా కాలక్షేపం అవుతున్నది కూడా ఆ మొబైల్ ఫోన్ తోనే అని చెప్పాలి, అయితే ఇలా మొబైల్ ఫోన్ మాట్లాడే వారు ఎక్కువ సేపు మాట్లాడితే ఆ రేడియేషన్ వల్ల మీకు మెదడుకి చాలా ప్రమాదం, గుండెకి చాలా ప్రమాదం.
అయితే తాజాగా సోని అగర్వాల్ అనే యువతి తన బాయ్ ఫ్రెండ్ తో బెడ్ రూమ్ లో వీడియో కాల్ మాట్లాడుతోంది, ఈ సమయంలో చార్జ్ పర్సెంటేజ్ తగ్గింది, వెంటనే కాల్ కట్ చేయకుండా చార్జ్ పెట్టి వీడియో కాల్ మాట్లాడింది, వెంటనే 5 నిమిషాల్లో ఫోన్ హీట్ అయి పేలిపోయింది.
దీంతో ఆమె కంటిచూపు పోయింది, వెంటనే డాక్టర్లు ఆమెకి చికిత్స అందించారు.. కంటిచూపు మాత్రం కోల్పోయింది, ఆ మొబైల్ పార్ట్స్ కంటిలోకి గుచ్చుకున్నాయి, చూశారుగా ఇలాంటి తప్పులు మాత్రం చేయకండి ఫోన్ చార్జ్ పెట్టి కాల్స్ వీడియో కాల్స్ మాట్లాడవద్దు, గేమ్స్ ఆడవద్దు చాటింగ్ చేయవద్దు అలాగే 95 శాతం చార్జ్ పెట్టి తీసేయండి, 100 శాతం అయ్యాక కూడా చార్జ్ పెట్టి ఉంచినా ప్రమాదమే గుర్తుంచుకోండి.