పిల్లలే తల్లిదండ్రులకి సర్వస్వం , వారు చదువుకుని ప్రయోజకులు అయితే వారికి అంతకు మించి మరొక ఆనందం ఉండదు, అయితే ఈ కరోనా సమయంలో చాలా కుటుంబాల్లో ఇబ్బందులు ఉన్నాయి, ఈ సమయంలో స్కూళ్లు లేవు, అయితే టీచర్లు విద్యార్దులకి ఆన్ లైన్ క్లాసులు భోధిస్తున్నారు.
ఈ సమయంలో ఇలా ఆన్ లైన్ పాఠాలు వినేందుకు తన ఇంట్లో టీవీ లేదు, దీంతో తన పిల్లల చదువు ఏమి అవుతుందో అని ఈ తల్లి ఏకంగా తన తాళిని తాకట్టు పెట్టి టీవీ కొంది, తన పిల్లలు బాగా చదువుకోవాలి అని ఆమె ఈ పని చేసింది.
కర్ణాటకలోని గదగ జిల్లా నరగుంద తాలూకా రెడ్డేర్ నాగనూరులో జరిగిందీ ఘటన…తాళిని రూ. 20 వేలకు తాకట్టుపెట్టి టీవీ కొనుగోలు చేసి కనెక్షన్ పెట్టింది. దీంతో ఈ విషయం అక్కడ అధికారులకి నాయకులకి తెలిసింది వెంటనే ఆమె గురించి ఆరా తీస్తున్నారు,ఆమెకి సాయం చేస్తామని ముందుకు వచ్చారు గ్రామస్తులు.