నేటి సమాజంలో దారుణమైన ఘటనలు జరుగుతున్నాయి, కొన్ని అస్సలు ఎవరూ ఊహించనివి అనే చెప్పాలి, ఈ రోజుల్లో మనిషి ఎలా బతికినా అంత్యక్రియలు మాత్రం తప్పకుండా చేయాలి అని అందరూ భావిస్తారు, చావు రోజు మాత్రం చివరి చూపు చూస్తారు అందరూ,మనిషి పుట్టుకే కాదు.. చావు కూడా డబ్బుతో ముడిపడి ఉంది.
ఇది ఎవరు కాదు అన్నా సత్యం.డబ్బులు లేక ఓ గిరిజన మహిళ శవాన్ని నేరుగా నదిలో పడేశారు. మధ్యప్రదేశ్‌లో సిధీ జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటన తెలిసి చాలా మంది కంగుతిన్నారు,సర్కారు తీరుపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి.
నాలుగు రోజుల క్రితం ఓ గిరిజన మహిళ అనారోగ్యానికి గురైంది. దీంతో ఆమెను ఎడ్లబండిలో ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఆమె పరిస్థితి విషమించడంతో మరణించింది. అంబులెన్స్ ఇవ్వాలని ఆమె బంధువులు వైద్య సిబ్బందిని కోరినా ఇవ్వలేదు. చివరకు ఆమెని తీసుకువస్తున్న సమయంలో సోన్ నదిలో శవాన్ని పడేశారు, దీనిపై జిల్లా కలెక్టర్ సీరియస్ అయ్యారు, దీనిపై విచారణ చేస్తున్నారు .